Begin typing your search above and press return to search.
స్టార్ రేంజు కాలేడా ఇక్కడ?
By: Tupaki Desk | 6 Nov 2018 1:30 AM GMTసౌతిండియాలో సూపర్‌స్టార్ రజనీకాంత్ తర్వాత మాస్‌లో ఆ స్థాయి ఎవరికి ఉంది? ఈ ప్రశ్నకు సమాధానం చెప్పాలంటే కాస్త ఆలోచించాలి. పవన్ కల్యాణ్, మహేష్ అని చెప్పేస్తే కుదరదు. అటువైపు తమిళనాడులోనే వీళ్లకు ధీటైన వేరొక స్టార్ హీరో ఉన్నాడు. అతడే ఇలయదళపతి విజయ్. మాస్‌లో భీభత్సమైన ఫాలోయింగ్ ఉన్న స్టార్ అతడు. ఇంటెలెక్చువల్‌గా సరైన స్క్రిప్టుల్ని ఎంచుకుంటూ.. అద్భుతమైన ప్రతిభతో మెప్పించడం అతడి ప్రత్యేకత. ముఖ్యంగా మాస్ పల్స్ పట్టుకుని గుంజేయడంలో విజయ్ తర్వాతేనని అతడి ట్రాక్ రికార్డే చెబుతోంది. ఇటీవలే రిలీజైన `మెర్సల్` చిత్రం ఒక్క తమిళనాడులోనే 200కోట్లు వసూలు చేసిందంటే అర్థం చేసుకోవచ్చు. ప్రపంచవ్యాప్తంగా భారీ ఫ్యాన్ బేస్ ఉన్న తమిళ స్టార్‌గా అతడు ఎదురేలేనివాడిగా చెలామణి అవుతున్నాడు. తమిళనాడులో ఎన్ని రాజకీయాలు ఉన్నా, ఎన్ని అడ్డంకులు ఉన్నా విజయ్‌కి ఉన్న అభిమాన బలం ముందు అవన్నీ ఉఫ్‌మని ఎగిరిపోతున్నాయి. అసలు విజయ్ సినిమా వస్తోంది అంటే అక్కడ ఉండే క్రేజు వేరేగా ఉంటోంది.
ప్రస్తుతం విజయ్ నటించిన `సర్కార్` దీపావళి కానుకగా రిలీజవుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా దాదాపు 150కోట్ల మేర ప్రీరిలీజ్ బిజినెస్ చేసింది. అందుకు తగ్గట్టే తమిళనాడులో ప్రీటికెట్ సేల్ ధమాకా మోగించిందని తెలుస్తోంది. అయితే ఈ సినిమాని తెలుగులోనూ రిలీజ్ చేస్తున్నా.. ఎందుకనో అక్కడ ఉన్నంత హైప్ ఇక్కడ లేదు. ఆ హైప్ క్రియేట్ చేయడంలో ఇక్కడ రిలీజ్ చేస్తున్న నిర్మాతలు ఫెయిలయ్యారన్న మాటా వినిపిస్తోంది. తుపాకి, మెర్సల్ సినిమాలతో విజయ్ ఇక్కడా అంతో ఇంతో మార్కెట్ ఏర్పరుచుకున్నాడు. కానీ `సర్కార్`కి సరైన ప్రమోషన్ చేయకపోవడంతో తెలుగు మార్కెట్లో పూర్తిగా డల్ అయిపోయిందన్న మాట వినిపిస్తోంది. అలాగే మురుగదాస్ గత చిత్రం `స్పైడర్` ఫ్లాప్ ప్రభావం `సర్కార్`పై టూ బ్యాడ్‌గా పడిందిట. పెద్దంతగా బజ్ లేకపోవడానికి కారణమిదేనని ట్రేడ్‌లో చర్చ సాగుతోంది. అయితే ఈ సినిమా రిలీజై బంపర్ హిట్టు అని ప్రచారం సాగితే తప్ప ఇక్కడ ప్రేక్షకుల్ని థియేటర్లకు రప్పించడం కష్టమే. అది కూడా పోస్ట్ రిలీజ్ ప్రమోషన్స్ బావుంటేనే పాజిబుల్. సూపర్‌స్టార్ రజనీ తర్వాత అంతే క్రేజు ఉన్న విజయ్‌ని తెలుగులో మాత్రం పెద్ద స్టార్ కాలేకపోతున్నాడు. ఇక్కడా స్టార్ రేంజులో వసూళ్లు తెచ్చే సత్తా అతడికి లేదని తీసిపారేయలేం. కానీ లోపం ఎక్కడుందో అది విజయ్ & సర్కార్ టీమ్ విశ్లేషించుకోవాల్సి ఉంటుంది.