Begin typing your search above and press return to search.
సర్కారు వారి ఊర మాస్ ట్రైలర్ కట్.. మెంటల్ మాస్ సాంగ్ రెడీ..!
By: Tupaki Desk | 26 April 2022 5:30 AM GMTసూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న లేటెస్ట్ మూవీ ''సర్కారు వారి పాట''. పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. సినీ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న ఈ చిత్రాన్ని మే 12న ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల చేయనున్నారు.
అయితే రిలీజ్ డేట్ దగ్గర పడుతున్నా దూకుడుగా ప్రమోషన్స్ చేయడం లేదని నిర్మాణంలో మేజర్ షేర్ ఉన్న మైత్రీ మూవీ మేకర్స్ సంస్థను మహేష్ ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా ట్రోల్ చేస్తూ వస్తున్నారు. నెగెటివ్ హ్యాష్ ట్యాగ్స్ తో ట్రెండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మేకర్స్ శరవేగంగా ప్రచార కార్యక్రమాలు నిర్వహించడానికి రెడీ అయినట్లు తెలుస్తోంది.
రెగ్యులర్ గా సినిమాకు సంబంధించి ఏదొక అప్డేట్ వదులుతూ.. 'సర్కారు వారి పాట' ను వార్తల్లో నిలిపేలా ప్రమోట్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి వచ్చిన ప్రమోషనల్ కంటెంట్ విశేష స్పందన తెచ్చుకుని, సినిమాపై అంచనాలు పెంచేసింది. రీసెంట్ గా రిలీజ్ చేసిన టైటిల్ సాంగ్ యూట్యూబ్ లో మిలియన్ల వ్యూస్ తో దూసుకుపోతోంది. కోర్ టీం తో ఇంటర్వ్యూలు కూడా మొదలుపెట్టారు.
ఇదే క్రమంలో 'సర్కారు వారి పాట' నుంచి పవర్ ఫుల్ ట్రైలర్ కట్ ను రెడీ చేస్తున్నారు. అంతేకాదు సినిమాలోని మాస్ సాంగ్ ను రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ఎస్ థమన్ దీని గురించి ట్విట్టర్ లో హింట్ ఇచ్చారు. మెంటల్ మాస్ స్వాగ్.. ఇంతకముందు చూడని సూపర్ స్టార్ ను చూడటానికి రెడీగా ఉండమని మేకర్స్ పేర్కొన్నారు.
SVP ట్రైలర్ మరియు ఊర మాస్ సాంగ్ లకు సంబంధించిన అప్డేట్స్ ఇవ్వడానికి టీమ్ సన్నద్ధం అవుతోంది. కటౌట్లు రెడీ చేసుకోండమ్మా అంటూ సోషల్ మీడియాలో సందడి స్టార్ట్ చేశారు. ఇన్నాళ్లూ అప్డేట్స్ లేవని అసహనం వ్యక్తం చేస్తున్న మహేశ్ అభిమానులకు ఇది డబుల్ ట్రీట్ అనే చెప్పాలి.
కాగా, 'సర్కారు వారి పాట' సినిమాలో మహేష్ బాబు సరికొత్త లుక్ లో కనిపించనున్నారు. వింటేజ్ మహేష్ ను చూడబోతున్నట్లు ప్రచార చిత్రాలు చూస్తే అర్థం అవుతోంది. ఇందులో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించింది. సముద్ర ఖని - ప్రకాష్ రాజ్ - వెన్నెల కిషోర్ - సుబ్బరాజు తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.
మైత్రీ మూవీ మేకర్స్ - GMB ఎంటర్‌టైన్‌మెంట్ మరియు 14 రీల్స్ ప్లస్ సంస్థలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నవీన్ యెర్నేని - వై. రవిశంకర్ - రామ్ ఆచంట - గోపీచంద్ ఆచంట నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఆర్. మది ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ అందించగా.. ఏఎస్ ప్రకాష్ ఆర్ట్ డైరెక్టర్ గా వర్క్ చేశారు. మార్తాండ్ కె వెంకటేష్ ఎడిటింగ్ బాధ్యతలు స్వీకరించారు.