Begin typing your search above and press return to search.

ఫొటోటాక్ : సర్కారు వారి స్పెయిన్ పాట ఇలా పూర్తి

By:  Tupaki Desk   |   26 Oct 2021 6:13 AM GMT
ఫొటోటాక్ : సర్కారు వారి స్పెయిన్ పాట ఇలా పూర్తి
X
సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు సర్కారు వారి పాట సినిమా చిత్రీకరణ స్పెయిన్‌ లో జరుగుతున్న విషయం తెల్సిందే. స్పెయిన్ లో మొదట టాకీ పార్ట్‌ షూట్‌ చేశారు. ఇటీవల పాట చిత్రీకరణ మొదలు పెట్టారు. స్పెయిన్ లోని అందమైన లొకేషన్స్ లో అంతకు మించి అందమైన ఇంగ్లీష్ ముద్దుగుమ్మల నడుమ శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీతో మహేష్‌ బాబు మరియు కీర్తి సురేష్‌ ల కాంబోలో రొమాంటిక్ సాంగ్ చిత్రీకరణ జరిగింది. సాంగ్ చిత్రీకరణ పూర్తి అయ్యిందంటూ చిత్ర యూనిట్‌ సభ్యులు ప్రకటించారు. యూనిట్‌ సభ్యులు కొన్ని ఫొటోలు మరియు వీడియోను అనధికారికంగా రివీల్‌ చేయడం జరిగింది. స్పెయిన్‌ షెడ్యూల్‌ ను ఈ పాటతో ముగించబోతున్నారా లేదంటే ఇంకా టాకీ పార్ట్‌ ఏమైనా బ్యాలన్స్ ఉందా అనేది తెలియాల్సి ఉంది.

మహేష్‌ బాబు తాజా పాటలో ఇంగ్లీష్‌ ముద్దుగుమ్మల మద్యలో వారి కలర్ కు ఏమాత్రం తక్కువ కాదన్నట్లుగా ఉన్నాడు అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. నెట్టింట ఈ ఫొటోలు వైరల్‌ అవుతున్నాయి. అభిమానులు ఈ పిక్స్ కు సోషల్‌ మీడియాలో తెగ ట్రెండ్‌ చేస్తున్నారు. మహేష్‌ బాబు లుక్‌ చాలా బాగుంది అంటూ అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు. మహేష్ బాబు చెంప గిల్లుతూ అందరు అతడి చుట్టు చేరి కూర్చున్న స్టిల్స్ ను సరదాగా యూనిట్‌ సభ్యులు షేర్‌ చేయడం జరిగింది. కీర్తి సురేష్‌ కు సంబంధించిన విజువల్స్‌ కాని కనీసం ఒక ఫొటో కాని రివీల్‌ చేయలేదు. ఆమె ఏ కాస్ట్యూమ్స్ లో ఉండి ఉంటుందా అంటూ అంతా ఆసక్తిని వ్యక్తం చేస్తున్నారు.

పరశురామ్‌ దర్శకత్వం లో మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. గీతా గోవిందం సినిమా తర్వాత దర్శకుడు పరశురామ్‌ మరియు మహేష్‌ బాబు గత ఏడాది సరిలేరు నీకెవ్వరు తర్వాత చేస్తున్న సినిమా అవ్వడం వల్ల సహజంగానే అంచనాలు పీక్స్ లో ఉంటాయి. ఇక కరోనా తర్వాత సినిమాల హడావుడి తెగ కనిపిస్తుంది. కనుక సర్కారు వారి పాట కూడా చాలా హైప్ ను క్రియేట్‌ చేస్తుంది. సంక్రాంతికి ఈ సినిమా విడుదల చేస్తామని ఇప్పటికే యూనిట్‌ సభ్యులు ప్రకటించారు. కాని విడుదల విషయంలో మార్పు ఉండే అవకాశం ఉందని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. చివరి నిమిషంలో సినిమాను వాయిదా వేసి వచ్చే ఏడాది సమ్మర్ లో విడుదల చేసే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.