Begin typing your search above and press return to search.

సర్కారు వారి ఫస్ట్‌ పాట కోసం సంక్రాంతి వరకు వెయిట్‌ చేయాలా?

By:  Tupaki Desk   |   13 Nov 2021 6:45 AM GMT
సర్కారు వారి ఫస్ట్‌ పాట కోసం సంక్రాంతి వరకు వెయిట్‌ చేయాలా?
X
సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు.. కీర్తి సురేష్ జంటగా పరశురామ్‌ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా సర్కారు వారి పాట. ఈ సినిమా చిత్రీకరణ ముగింపు దశకు వచ్చింది. సంక్రాంతికి సినిమాను విడుదల చేయాలనుకున్నా కూడా ఆర్ ఆర్ ఆర్‌ విడుదల కారణంగా వాయిదా వేస్తున్నట్లుగా ప్రకటించారు.

ఏప్రిల్‌ కు వాయిదా పడ్డ సర్కారు వారి పాట సినిమా నుండి మొదటి పాట ఎప్పుడెప్పుడు వస్తుందా అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే సర్కారు వారి పాట గ్లిమ్స్ వీడియో వచ్చేసింది. ఆ సమయంలోనే పాట కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయని వార్తలు వచ్చాయి.

సంగీత దర్శకుడు థమన్‌ చాలా స్పెషల్‌ ఫోకస్ తో సర్కారు వారి పాట సినిమా పాటలను రెడీ చేశాడట. భారీ అంచనాలున్న ఈ సినిమా మొదటి పాటను విడుదల చేయడం కోసం అతడు కూడా చాలా ఇంట్రెస్ట్‌ తో ఉన్నాడట. కాని సినిమా విడుదల వాయిదా పడటం వల్ల పాటల విడుదల ప్లాన్ కూడా మారినట్లుగా తెలుస్తోంది.

సినిమా సంక్రాంతికే వచ్చేది ఉంటే ఇప్పటికే ఫస్ట్‌ సింగిల్ వచ్చి ఉండేది. దసరా లేదా దీపావళికి మహేష్‌ బాబు పాటల సందడి మొదలు అయ్యి ఉండేది కాని ఇప్పుడు సినిమా ఏప్రిల్‌ అంటున్నారు. కనుక సమయం ఇంకా మూడు నెలలకు పైగా ఉంది. ఆ ఉద్దేశ్యంతోనే పాటలను ఇప్పటి నుండే విడుదల చేయడం వల్ల బజ్ తగ్గే అవకాశాలు ఉన్నాయంటూ అభిప్రాయం వ్యక్తం అవుతుందట. అందుకే సర్కారు వారి పాట మొదటి పాటు వచ్చే సంక్రాంతికి విడుదల చేయాలని భావిస్తున్నారట.

సినిమా విడుదల తేదీని ఎప్పుడు అయితే అనుకున్నారో అదే రోజున మొదటి పాటను విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నట్లుగా చెబుతున్నారు. సంక్రాంతికి మొదటి పాటను విడుదల చేసి ఆ వెంట వెంటనే ఇతర పాటలను కూడా విడుదల చేస్తారని అంటున్నారు. థమన్ మాస్ తో పాటు క్లాస్ ఆడియన్స్ ను కూడా ఆకట్టుకునేలా మంచి ఆల్బమ్‌ ను సర్కారు వారి పాట సినిమా ద్వారా ఇవ్వబోతున్నట్లుగా టాక్ వినిపిస్తుంది.

మహేష్ బాబు సర్కారు వారి పాట లుక్‌ ఇప్పటికే సినిమా పై అంచనాలు పెంచేస్తోంది. చాలా ఏళ్ల తర్వాత ఒక మంచి స్టైలిష్ లుక్ లో మహేష్‌ కనిపించబోతున్నాడు. ఇక కీర్తి సురేష్ మరియు మహేష్‌ బాబుల కాంబో సన్నివేశాలు ఎలా ఉండబోతున్నాయో ఇటీవల విడుదల అయిన గ్లిమ్స్ లో చెప్పకనే చెప్పారు.

ఇక సినిమా కథ విషయానికి వస్తే బ్యాంకింగ్ రంగంలో జరుగుతున్న అవినీతి మరియు ఆర్థిక నేరగాళ్ల గురించిన విషయాలు చూపిస్తూనే ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్ టైన్ మెంట్‌ ను అందించేలా ప్లాన్ చేస్తున్నట్లుగా సమాచారం అందుతోంది. భారీ ఎత్తున అంచనాలున్న సర్కారు వారి పాట సినిమా ఏప్రిల్‌ లో విడుదల అవ్వడం వల్ల ఖచ్చితంగా భారీ వసూళ్లను దక్కించుకునే అవకాశం ఉందంటున్నారు. పోటీ లేని సమయంలో రావడం వల్ల ఖచ్చితంగా కలిసి వస్తుందని అంటున్నారు.