Begin typing your search above and press return to search.
సర్కారు వారి ఆల్ టైమ్ రికార్డ్.. 4 డేస్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్..!
By: Tupaki Desk | 16 May 2022 9:58 AM GMTసూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన ''సర్కారు వారి పాట'' సినిమా నాలుగు రోజుల ఫస్ట్ వీకెండ్ ను పూర్తి చేసుకుంది. పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ.. టాక్ తో సంబంధం లేకుండా బాక్సాఫీస్ వసూళ్ళు రాబడుతోంది. మూడో రోజు నుంచి ఈ సినిమా కలెక్షన్లలో గ్రోత్ కనిపించగా.. నాల్గవ రోజు (ఆదివారం) తెలుగు రాష్ట్రాల్లో 14.04 కోట్ల షేర్ ను రాబట్టినట్లు నిర్మాతలు ప్రకటించారు.
ఓవర్ సీస్ లో మహేష్ బాబు కు మంచి మార్కెట్ ఉందనే సంగతి తెలిసిందే. ఇప్పుడు 'సర్కారు వారి పాట' సినిమా ఈ విషయాన్ని మరోసారి రుజువు చేసింది. యూఎస్ఏలో ఈ మూవీ ప్రీమియర్స్ మరియు నాలుగో రోజు వసూళ్ళు కలుపుకొని 2 మిలియన్ డాలర్ల మార్కును క్రాస్ చేసింది.
ఇప్పటి వరకు 'సర్కారు వారి పాట' సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ. 95.08 కోట్ల షేర్ రాబట్టినట్లు నిర్మాతలు ప్రకటించారు. ఇది ఒక ప్రాంతీయ చిత్రానికి ఆల్ టైమ్ రికార్డ్ గా పేర్కొనబడింది. సోమవారంతో ఈ మూవీ రూ. 100 కోట్ల షేర్ ను క్రాస్ చేస్తుందని చెబుతున్నారు.
SVP చిత్రం ఓవర్సీస్ మరియు డొమెస్టిక్ లో అనేక ఇతర రికార్డులను నమోదు చేసిందని తెలుస్తోంది. 95 కోట్లకు పైగా షేర్ తో.. కేవలం 4 రోజుల్లోనే అన్ని సినిమాల మొదటి వారం కలెక్షన్లను క్రాస్ చేసింది. అలానే అత్యధికంగా 1.5M+ ఓవర్సీస్ కలెక్షన్స్ (8 సినిమాలు) కలిగి ఉన్న ఒకే ఒక్క సౌత్ ఇండియన్ హీరోగా మహేశ్ నిలిచారు.
'సర్కారు వారి పాట' మహేష్ బాబుకి ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో 1 కోటికి పైగా షేర్ వసూలు చేసిన 10వ చిత్రం. అంతేకాదు మహేష్ కెరీర్ లో 2 మిలియన్లకు పైగా వసూలు చేసిన నాలుగో సినిమాగా నిలిచింది. ప్రభాస్ పాన్ ఇండియా సినిమాలతో.. రజినీకాంత్ ద్విభాషా చిత్రాలతో ఈ ఘనత సాధించగా.. మహేశ్ కేవలం రీజనల్ మూవీతో రికార్డ్ క్రియేట్ చేయడం గమనార్హం.
మేకర్స్ ప్రకటించిన లెక్కల ప్రకారం SVP 4 రోజుల షేర్ల వివరాలు:
నైజాం - 29.61 కోట్లు
సీడెడ్ - 9.81 కోట్లు
ఉత్తరాంధ్ర - 9.36 కోట్లు
గుంటూరు - 7.57 కోట్లు
తూర్పు - 6.51 కోట్లు
కృష్ణ - 5.4 కోట్లు
వెస్ట్ - 4.41 కోట్లు
నెల్లూరు - 2.91 కోట్లు
మొత్తం (AP/TG) - 75.58 కోట్లు
కర్ణాటక+ROI - 7.6 కోట్లు
ఓవర్సీస్ - 11.9 కోట్లు
మొత్తం వరల్డ్ వైడ్ షేర్ - 95.08 కోట్లు
కాగా, 'సర్కారు వారి పాట' చిత్రంలో మహేశ్ బాబు సరసన కీర్తి సురేష్ తొలిసారిగా హీరోయిన్ గా నటించింది. సముద్రఖని - వెన్నెల కిషోర్ - నదియా - సుబ్బరాజు తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఎస్ఎస్ థమన్ సంగీతం సమకూర్చారు. ఆర్. మది సినిమాటోగ్రఫీ అందించగా.. ఏఎస్ ప్రకాశ్ ఆర్ట్ డైరెక్టర్ గా వర్క్ చేశారు.
మైత్రీ మూవీ మేకర్స్ - జీఎంబీ ఎంటర్టైన్మెంట్స్ - 14 రీల్స్ ప్లస్ బ్యానర్లు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించాయి. నవీన్ యెర్నేని - వై. రవిశంకర్ - రామ్ ఆచంట - గోపీచంద్ ఆచంట నిర్మాతలు. సర్కారు వారి సక్సెస్ సెలబ్రేషన్స్ లో భాగంగా ఇవాళ సాయంత్రం కర్నూల్ లో ఈవెంట్ నిర్వహించనున్నారు. దీనికి మహేష్ బాబుతో పాటుగా మొత్తం కోర్ టీం హాజరు కానుంది.