Begin typing your search above and press return to search.
ఇంతకీ 'సర్కారు వారి పాట' బ్రేక్ ఈవెన్ అయిందా లేదా..??
By: Tupaki Desk | 28 May 2022 4:32 AM GMTసూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన ''సర్కారు వారి పాట'' సినిమా రెండు వారాల థియేట్రికల్ రన్ పూర్తి చేసుకొని.. మూడో వారంలో ఎంటర్ అయింది. తొలి రోజే డివైడ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా.. థర్డ్ వీక్ లో ప్రదర్శించబడుతోంది అంటే అది మహేశ్ స్టార్ పవర్ వల్లనే అని చెప్పొచ్చు. కాకపోతే మేకర్స్ చెబుతున్న లెక్కలకు ట్రేడ్ వర్గాల నివేదికలకు మధ్య వ్యత్యాసం ఉండటంతో ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అయిందా లేదా అనే చర్చ జరుగుతోంది.
'సర్కారు వారి పాట' సినిమా 122 - 125 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగింది. అందులో యుఎస్ఏలో 2.4 మిలియన్ డాలర్ల బాక్సాఫీస్ టార్గెట్ ఉండగా.. రెండు వారాల్లో $2,326,223 కలెక్ట్ చేసినట్లు తెలుస్తోంది. డిస్ట్రిబ్యూటర్ బ్రేక్ ఈవెన్ మార్క్ అందుకోవాలంటే ఈ మూవీ అమెరికాలో ఇంకా $75K డాలర్లు వసూలు చేయాల్సి ఉంది.
SVP మేకర్స్ లెక్కల ప్రకారం ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా మొదటి 12 రోజుల్లోనే 200 కోట్లకు పైగా రాబట్టి ప్రాంతీయ చిత్రాల్లో ఆల్ టైం రికార్డ్ క్రియేట్ చేసింది. పలువురు ట్రేడ్ నిపుణులు చెబుతున్న దాని ప్రకారం 15 రోజుల్లో మహేష్ బాబు సినిమా ₹ 201.32 కోట్లు రాబట్టింది. మొదటి వారంలో ₹ 178.50 కోట్లు + రెండో వారం ₹ 21.78 కోట్లు + మూడో వారంలో ఫస్ట్ డే (గురువారం) ₹ 1.04 కోట్లు వసూలు చేసినట్లు పేర్కొన్నారు.
అలానే తెలుగు రాష్ట్రాల్లో సర్కారు వారు 140 కోట్ల మార్క్ ను క్రాస్ చేసినట్లు వెల్లడించారు. ఫస్ట్ వీక్ లో ₹ 121.75 కోట్లు - రెండో వారంలో ₹ 17.62 కోట్లు - మూడో వారంలో మొదట రోజు 87 లక్షల వసూళ్లతో మొత్తం ₹ 140.24 కోట్లు రాబట్టినట్లు చెబుతున్నారు. ఆల్రెడీ ప్రాఫిట్ జోన్ లోకి వెళ్లినట్లు మేకర్స్ చెబుతుంటే.. కొన్ని వెబ్ పోర్టల్స్ లో మాత్రం బ్రేక్ ఈవెన్ కు ఇంకా 13 కోట్లు అవసరం అవుతుందని అంటున్నారు.
ఇందులో ఎవరి ఫిగర్స్ కరెక్ట్? బ్రేక్ ఈవెన్ అయిందా లేదా? అనే వాటిపై స్పష్టత లేకుండా పోయింది. ఇవన్నీ పక్కన పెడితే.. మూడో వారంలో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించడానికి 'సర్కారు వారి పాట' సినిమాలో శనివారం నుంచి 'మురారి బావ' పాటని జత చేయనున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఇదిలా ఉంటే SVP చిత్రాన్ని జూన్ 10 లేదా జూన్ 24న అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో స్ట్రీమింగ్ చేయనున్నట్లు టాక్ వినిపిస్తోంది.
కాగా, 'సర్కారు వారి పాట' చిత్రానికి పరశురాం దర్శకత్వం వహించారు. ఇందులో మహేశ్ బాబు సరసన కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించింది. ఎస్ఎస్ థమన్ సంగీతం సమకూర్చగా.. ఆర్ మాది సినిమాటోగ్రఫీ అందించారు. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ - జీఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్స్ - 14 రీల్స్ ప్లస్ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి.