Begin typing your search above and press return to search.

నైజాంలో ఓపెన్‌ కాని 'సర్కారు వారి పాట' టికెట్‌ కౌంటర్స్‌.. అదే కారణం

By:  Tupaki Desk   |   9 May 2022 6:30 AM GMT
నైజాంలో ఓపెన్‌ కాని సర్కారు వారి పాట టికెట్‌ కౌంటర్స్‌.. అదే కారణం
X
సూపర్‌ స్టార్‌ మహేష్ బాబు.. కీర్తి సురేష్ జంటగా తెరకెక్కిన సర్కారు వారి పాట విడుదల ఈనెల 12వ తారీకు అనే విషయం తెల్సిందే. విడుదల తేదీ దగ్గర పడుతుంది. దాంతో ఇప్పటికే యూఎస్ లో అడ్వాన్స్ బుకింగ్‌ ప్రారంభం అయ్యింది. ఏపీలో కూడా అడ్వాన్స్ బుకింగ్ షురూ అయినట్లుగా వార్తలు వస్తున్నాయి. మరో నాలుగు రోజుల సమయం ఉండగా ఇంకా కూడా నైజాం ఏరియాలో అడ్వాన్స్ బుకింగ్‌ ఆరంభం కాలేదు.

సర్కారు వారి పాట సినిమా ను నైజాం ఏరియాలో దిల్ రాజు కొనుగోలు చేశాడనే వార్తలు వస్తున్నాయి. ఆయన తెలంగాణ ప్రభుత్వం నుండి టికెట్ల రేట్ల పెంపుకు అనుమతి కోసం ఎదురు చూస్తున్నారు. ఈమద్య కాలంలో పెద్ద సినిమా లు అన్ని కూడా మొదటి పది రోజుల పాటు టికెట్ల రేట్లు పెంచుకునే వెసులుబాటు ను దక్కించుకున్నాయి. కనుక సర్కారు వారి పాట కు కూడా తెలంగాణ ప్రభుత్వం నుండి అనుమతి వచ్చే అవకాశం ఉందని చూస్తున్నారు.

ఇటీవలే ఏపీ ప్రభుత్వం నుండి సర్కారు వారి పాట సినిమా టికెట్ల రేట్ల పెంపుకు అనుమతి దక్కింది. కాని తెలంగాణ ప్రభుత్వం మాత్రం ఇంకా అందుకు సంబంధించి ఎలాంటి అప్‌డేట్‌ ఇవ్వడం లేదు. నేడో రేపో ఖచ్చితంగా తెలంగాణ ప్రభుత్వం కూడా సర్కారు వారి పాట సినిమా టికెట్ల రేట్లను పెంచుకునేందుకు అనుమతి ఇచ్చే అవకాశాలు ఉన్నాయంటూ ఇండస్ట్రీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.

ఆ కారణంగానే నైజాం ఏరియాలో ఎక్కడ కూడా సర్కారు వారి పాట యొక్క అడ్వాన్స్ బుకింగ్‌ టికెట్లను ఇవ్వడం లేదు. టికెట్ల రేట్ల పెంపుకు సంబంధించిన అనుమతి తో పాటు బెనిఫిట్ షో కు సంబంధించిన అనుమతులు కూడా రావాల్సి ఉంది. ఆ రెండు విషయాల పట్ల తెలంగాణ సర్కారు నుండి క్లారిటీ వస్తే అప్పుడు టికెట్‌ కౌంటర్లు తెరుచుకునే అవకాశం ఉంది.

సరిలేరు నీకెవ్వరు సినిమా తో బ్లాక్ బస్టర్ సక్సెస్ ను దక్కించుకున్న మహేష్‌ బాబు మరోసారి ఈ సినిమా తో బ్లాక్ బస్టర్‌ ను దక్కించుకోవడం ఖాయం అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు మరియు అభిమానులు నమ్మకం వ్యక్తం చేస్తున్నారు. సర్కారు వారి పాట సినిమా లో మాస్ ఎలిమెంట్స్ తో పాటు క్లాస్ ఎలిమెంట్స్ కూడా ఉండి ఆకట్టుకుంటాయని.. తప్పకుండా మహేష్ బాబు మరియు కీర్తి సురేష్ ల కాంబోలో వచ్చే సన్నివేశాలు ఆకట్టుకుంటాయనే నమ్మకంను వ్యక్తం చేస్తున్నారు.