Begin typing your search above and press return to search.
సర్కారు వారి పాటకు గుమ్మడి కాయ టైమ్!!
By: Tupaki Desk | 28 Oct 2021 4:30 AM GMTసూపర్ స్టార్ మహేష్ బాబు సర్కారు వారి పాట స్పెయిన్ షెడ్యూల్ ముగింపు దశకు వచ్చింది. అక్కడ కీర్తి సురేష్ మరియు మహేష్ బాబుల కాంబినేషన్ లో ఒక రొమాంటిక్ సాంగ్ ను చిత్రీకరించడం జరిగింది. ఇంగ్లీష్ ముద్దుగుమ్మలు ఈ పాటలో కనిపించబోతున్నారు. ఆ పాటకు సంబంధించిన కొన్ని ఆన్ లొకేషన్ స్టిల్స్ లీక్ అయ్యి అందరి దృష్టిని ఆకర్షించడం జరిగింది. ఆ పాట సినిమా లో ప్రత్యేకంగా ఉంటుందని అంటున్నారు. ఇక మహేష్ బాబు సర్కారు వారి పాట సినిమా చిత్రీకరణ ముగింపు దశకు వచ్చినట్లుగా యూనిట్ సభ్యులు చెబుతున్నారు. స్పెయిన్ షెడ్యూల్ తర్వాత హైదరాబాద్ లో చివరి షెడ్యూల్ ను ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే హైదరాబాద్ లో షూటింగ్ కోసం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతున్నట్లుగా సమాచారం అందుతోంది.
హైదరాబాద్ షెడ్యూల్ ను నవంబర్ మొదటి వారం చివర్లో మొదటి పెట్టబోతున్నారు. చిన్న చిన్న బ్రేక్ లతో ఈ సినిమాను నవంబర్ చివరి వరకు ముగించేయబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం సర్కారు వారి పాట ఫస్ట్ కాపీని డిసెంబర్ వరకు రెడీ చేయాలని మహేష్ బాబు అండ్ టీమ్ ప్లాన్ చేసుకున్నారట. సంక్రాంతికి సినిమాను విడుదల చేయాలని నిర్ణయించుకున్నారు. కాని ఆర్ ఆర్ ఆర్ సినిమా తో పాటు భీమ్లా నాయక్ ఇంకా రాధే శ్యామ్ సినిమా లు సంక్రాంతికే వస్తున్న కారణంగా పోటీ నుండి సర్కారు వారి పాట తప్పుకునే యోచనలో ఉందనే వార్తలు వస్తున్నాయి. ఆ విషయంలో ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన అయితే రాలేదు కాని.. అదే జరుగబోతున్నట్లుగా మీడియా వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.
సినిమా విడుదల ఎప్పుడు ఉన్నా కూడా నవంబర్ లో సర్కారు వారి పాట కు ఖచ్చితంగా గుమ్మడి కాయ కొట్టడం ఖాయం అంటూ యూనిట్ సభ్యుల ద్వారా సమాచారం అందుతోంది. నవంబర్ లో ఈ సినిమా చిత్రీకరణ పూర్తి అయితే మహేష్ బాబు ఆ వెంటనే డిసెంబర్ రెండవ లేదా మూడ వారంలో త్రివిక్రమ్ మూవీని పట్టాలెక్కించే అవకాశాలు ఉన్నాయి. త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ బాబు సినిమా కోసం అభిమానులు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎక్కువ సమయం తీసుకోకుండా సినిమాను కేవలం నాలుగు అయిదు నెలల్లోనే పూర్తి చేసి విడుదల చేయాలని త్రివిక్రమ్ ఇప్పటికే ప్లాన్ చేసుకున్నాడట. వచ్చే ఏడాది దసరా లేదా అంతకు ముందుగానే మహేష్ మరియు త్రివిక్రమ్ ల కాంబో మూవీ వచ్చే అవకాశం ఉంది. సర్కారు వారి పాట మరియు త్రివిక్రమ్ మూవీ రెండు కూడా వచ్చే ఏడాదిలోనే విడుదల కాబోతున్నాయి. మహేష్ బాబు ఫ్యాన్స్ కు వచ్చే ఏడాది డబుల్ ధమాకా ఖాయం.