Begin typing your search above and press return to search.
సర్కారు వారి పాట అలా అలా సాగిపోతుంది
By: Tupaki Desk | 29 Aug 2021 11:30 AM GMTసూపర్ స్టార్ మహేష్ బాబు.. కీర్తి సురేష్ జంటగా పరశురామ్ దర్శకత్వంలో రూపొందుతున్న సర్కారు వారి పాట సినిమా షూటింగ్ చక చక జరుగుతోంది. భారీ అంచనాల నడుమ రూపొందుతున్న సర్కారు వారి పాట షూటింగ్ ను సెప్టెంబర్ లో ముగించేలా ప్లాన్ చేస్తున్నారు. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం సర్కారు వారి పాటకు సంబంధించిన కీలక షెడ్యూల్ ను ఇటీవలే గోవాలో ముగించుకుని హైదరాబాద్ వచ్చారు. గోవాలో యాక్షన్ సన్నివేశాలతో పాటు కీలక సన్నివేశాలను అక్కడ చిత్రీకరిస్తున్నట్లుగా యూనిట్ సభ్యులు చెబుతున్నారు.
ప్రస్తుతం సినిమా తదుపరి షెడ్యూల్ కోసం హైదరాబాద్ లో ఏర్పాట్లు చేస్తున్నారు. హైదరాబాద్ లో కీలక షెడ్యూల్ తో సినిమా షూటింగ్ దాదాపుగా పూర్తి అయినట్లుగానే చెబుతున్నారు. హైదరాబాద్ లో జరుగబోతున్న షెడ్యూల్ లో కీర్తి సురేష్ తో పాటు కీలక నటీనటులు పాల్గొనబోతున్నారు అంటూ సమాచారం అందుతోంది. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం అన్ని వర్గాల ప్రేక్షకులు ఎంటర్ టైన్ అయ్యేలా ఒక మంచి కమర్షియల్ ఎంటర్ టైనర్ గా సినిమాను రూపొందిస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.
సర్కారు వారి పాట సినిమా షూటింగ్ ను వచ్చే నెలతో ముగించేందుకు గాను దర్శకుడు పరశురామ్ ప్రయత్నాలు చేస్తున్నాడు. మహేష్ బాబు తదుపరి సినిమా ను త్రివిక్రమ్ దర్శకత్వంలో మొదలు పెట్టేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అక్టోబర్ లో సినిమాను పట్టాలెక్కిస్తామని అంటున్నారు. షూటింగ్ మరియు నిర్మాణ కార్యక్రమాలు అన్ని కూడా సెప్టెంబర్ మరియు అక్టోబర్ లో విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నారు. సినిమాను సంక్రాంతికి విడుదల చేస్తున్నట్లుగా ఇప్పటికే అధికారిక ప్రకటన వచ్చింది. సర్కారు వారి పాట షూటింగ్ ముగిసిన వెంటనే తన సినిమా మొదలు పెట్టేందుకు త్రివిక్రమ్ వెయిట్ చేస్తున్నారు. కనుక మరీ ఎక్కువ ఆలస్యం చేయకుండా మహేష్ బాబుతో సర్కారు వారి పాట పనిని ముగించాలని భావిస్తున్నారు.