Begin typing your search above and press return to search.
సర్కారు వారి పాట షెడ్యూల్ మార్పు
By: Tupaki Desk | 24 Nov 2020 11:40 PM ISTమహేష్ బాబు.. కీర్తి సురేష్ జంటగా పరశురామ్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా సర్కారు వారి పాట. ఈ సినిమా మొదటి షెడ్యూల్ ను అమెరికాలో ప్లాన్ చేశారు. ఇప్పటికే చిత్ర దర్శకుడితో పాటు ఇతర టీం కూడా వెళ్లి అక్కడ లొకేషన్స్ ను ఎంపిక చేయడం కూడా జరిగింది. మొన్నటి వరకు వీసా సంబంధిత చర్చలు జరుగుతున్నట్లుగా కూడా వార్తలు వచ్చాయి. కాని కరోనా వేవ్ 2 అంటూ హెచ్చరికలు వస్తున్న నేపథ్యంలో కాస్త ఆలస్యంగా అమెరికా షెడ్యూల్ ను ప్లాన్ చేయాలని నిర్ణయించుకున్నారు. మొదట హైదరాబాద్ లో షూటింగ్ చేయబోతున్నారు.
ఇటీవలే లాంచనంగా సినిమా షూటింగ్ ప్రారంభం అయ్యింది. రెగ్యులర్ షూటింగ్ ను 2021లో ప్రారంభిస్తామంటూ అధికారికంగా ప్రకటించారు. జనవరి లో హైదరాబాద్ లోని రామోజీ ఫిల్మ్ సిటీలో వేసిన సెట్ లో చిత్రీకరణ ప్రారంభించేందుకు దర్శకుడు పరశురామ్ సిద్దం అవుతున్నాడు. జనవరి మొత్తం హైదరాబాద్ లో చిత్రీకరణ జరుపనున్నారు. ఆ తర్వాత నెల అంటే ఫిబ్రవరి రెండవ లేదా మూడవ వారంకు అమెరికా షెడ్యూల్ ను ప్లాన్ చేయబోతున్నట్లుగా తెలుస్తోంది. ఈ సినిమాను జూన్ జులై వరకు పూర్తి చేయాలనే పట్టుదలతో మహేష్ బాబు ఉన్నాడట. వచ్చే ఏడాదిలోనే సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు.