Begin typing your search above and press return to search.

షార్జా చారిత్ర‌క ఎడారిలో స‌ర్కార్ వారి బృందం

By:  Tupaki Desk   |   5 Feb 2021 11:10 AM GMT
షార్జా చారిత్ర‌క ఎడారిలో స‌ర్కార్ వారి బృందం
X
ప్ర‌స్తుతం సర్కార్ వారి పాట చిత్రీక‌ర‌ణ దుబాయ్ ప‌రిస‌రాల్లో శ‌ర‌వేగంగా పూర్త‌వుతున్న సంగ‌తి తెలిసిందే. ఇంత‌కుముందే మ‌హేష్ పై స‌న్నివేశాల చిత్రీక‌ర‌ణ ప్రారంభ‌మైంది. ప‌నిలో ప‌నిగా సంగీత ద‌ర్శ‌కుడు థ‌మ‌న్ కూడా దుబాయ్ వెళ్లి తాను రెడీ చేసిన బాణీల్ని వినిపిస్తున్నారు. మ‌హేష్ స‌హా ద‌ర్శ‌క‌నిర్మాత‌లతో మమేక‌మై ప‌ని చేస్తున్నారు థ‌మ‌న్.

ఇదివ‌ర‌కూ థ‌మ‌న్ దుబాయ్ లో అడుగుపెట్ట‌గానే మ‌హేష్ సెట్స్ లో ఉన్న‌ప్ప‌టి ఫోటోని ఇన్ స్టాలో షేర్ చేసారు. అది అభిమానుల్లో వైర‌ల్ అయ్యింది. తాజాగా షార్జా మెలిహా పురావస్తు కేంద్రం ప‌రిస‌రాల్లో స‌ర్కార్ వారి పాట చిత్రీక‌ర‌ణ సాగుతోంద‌ని టీమ్ వెల్ల‌డించింది. ఇక్క‌డ‌ చిత్రీకరణ నిజంగా ఒక ప్రత్యేకమైన అనుభవం! చారిత్ర‌క కథల‌తో ప్రాచుర్యం చెందిన స్థ‌ల‌మిది. అద్భుతమైన వినోద కార్యకలాపాలు అద్భుతమైన ప్రకృతి దృశ్యాలు.. నా ఫేవ‌రెట్ గా నిలుస్తున్నాయి.

ఇక్క‌డివారి ఘ‌న‌మైన వెల్ కం ఆతిథ్యాన్ని అభినందిస్తున్నాను.. అంటూ మ‌హేష్ ఓ అద్భుత‌మైన ఫోటోని షేర్ చేశారు. ఎడారిలో ప్ర‌త్యేకించి విడిది ఇంటిని నిర్మించారు. అక్క‌డ భారీ వాహనం కూడా మ‌హేష్ టీమ్ కోసం సిద్ధంగా ఉంది. ఎంతో ప్లెజెంట్ వాతావ‌ర‌ణం లో షూట్ జ‌రుగుతోంద‌ని అర్థ‌మ‌వుతోంది.

అదే స్పాట్ నుంచి థ‌మ‌న్ ముసుగు ధ‌రించిన ఓ అద్భుత‌మైన ఫోటోని షేర్ చేసారు. మొత్తం మూసేశాం !! మ‌న వోన్ సూప‌ర్ స్టార్ న‌టిస్తున్న‌ సర్కరువారిపాట షూటింగ్ లో ఉన్నాను. ఆ నాటి `దూకుడు` రోజులు గుర్తుకొస్తున్నాయి..! అంటూ వ్యాఖ్య‌ను జోడించారు ఆ ఫోటోకి. 2010లో దుబాయ్ లో మ‌హేష్ దూకుడు షెడ్యూల్ చిత్రీక‌ర‌ణ ఇదే స్థ‌లంలో జ‌రిగింద‌న్న‌ది థ‌మ‌న్ గుర్తు చేశారు. ఆ సినిమాకి అత‌డే సంగీతం అందించిన సంగ‌తి తెలిసిన‌దే. ప్ర‌స్తుతం ఈ రెండు ఫోటోలు మ‌హేష్ అభిమానుల్లో వైర‌ల్ అవుతున్నాయి.

షార్జా మెలిహా పురావస్తు కేంద్రం గురించి వివ‌రాలు ఆస‌క్తిక‌రం. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ షార్జాలోని మలీహా గ్రామం చుట్టూ ఉన్న ప్రాంతాల చరిత్ర పురావస్తు శాస్త్రం ఆధారంగా సందర్శకుల కేంద్రంగా అభివృద్ధి చెందింది. నాటి సంరక్షించబడిన ఉమ్ అల్ నార్ యుగం సమాధి చుట్టూ నిర్మించబడిన న‌గ‌ర‌మిది.

గత 40 ఏళ్లుగా మెలీహా ఆ పరిసర ప్రాంతాలలో (అల్ తుకీబా, జెబెల్ ఫయా, అల్ మేడమ్ మరియు జెబెల్ బుహైస్ ‌లతో సహా) తవ్వకాలు ఆవిష్కరణలను ఇక్క‌డ పొందుప‌రిచారు. 130000- 120,000 సంవత్సరాల క్రితం శరీర నిర్మాణపరంగా ఆధునిక మానవులు మ్లీహా ప్రాంతంలో ఉన్నారనడానికి ఆధారాలను వెతికారు ఇక్క‌డ‌. ఈ అన్వేషణల ప్ర‌కారం.. ఆఫ్రికా నుండి ఎర్ర సముద్రం మీదుగా పెర్షియన్ గల్ఫ్ ప్రాంతానికి ఇరాన్- ఇండియా- యూరప్- ఆసియా ద్వారా ప్రపంచాన్ని విస్తరించార‌ని చ‌రిత్ర చెబుతోంది.