Begin typing your search above and press return to search.

మహేష్ బాబు ఖాతాలో మరో ఆల్ టైమ్ రికార్డ్..!

By:  Tupaki Desk   |   10 Aug 2021 6:40 AM GMT
మహేష్ బాబు ఖాతాలో మరో ఆల్ టైమ్ రికార్డ్..!
X
సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న లేటెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ ''సర్కారు వారి పాట''. దర్శకుడు పరశురామ్ పెట్లా ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నాడు. ఇందులో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది. ఆగష్టు 9న మహేష్ పుట్టినరోజు స్పెషల్ గా 'సూపర్ స్టార్ బర్త్ డే బ్లాస్టర్' పేరుతో 'సర్కారు వారి..' టీజర్ ను చిత్ర నిర్మాతలు రిలీజ్ చేశారు.

మైండ్‌ బ్లోయింగ్‌ అనిపించేలా ఉన్న ఈ సర్కారు వారి బ్లాస్టర్ అభిమానులనే కాకుండా.. సాధారణ ప్రేక్షకులను కూడా విశేషంగా ఆకట్టుకుంది. ఈ క్రమంలో విడుదలైన టాలీవుడ్ లో అల్ టైం రికార్డ్ క్రియేట్ చేసింది. 24 గంటల్లో 25.7 మిలియన్ వ్యూస్ సాధించి తెలుగులో అత్యధికంగా వీక్షించిన టీజర్స్ జాబితాలో మొదటి స్థానంలో నిలిచింది. 754K లైక్స్ రాబట్టిన ఈ టీజర్ యాడ్స్ లేకుండా ఇన్ని మిలియన్ల వ్యూస్ దక్కించుకోవడం గమనార్హం.

'సర్కారు వారి పాట' బ్లాస్టర్‌ లో స్టైలిష్ అండ్ ఎనర్జిటిక్ మహేష్ బాబు స్క్రీన్ ప్రెజన్స్ - ట్రేడ్ మార్క్ డైలాగ్ డెలివరీ - అద్భుతమైన కెమెరా పనితనం - అద్భుతమైన యాక్షన్ - బ్యాగ్రౌండ్ మ్యూజిక్ - గార్జియస్ కీర్తి సురేష్ మరియు నిర్మాణ విలువలు సినిమా ప్రేమికులకు నిజమైన విందుగా మార్చాయి. మహేష్ అభిమానుల్లో ఉత్సాహాన్ని రెట్టింపు చేసిన ఈ టీజర్ సినిమాపై అంచనాలను పెంచేసింది. ఈ క్రమంలో సినిమా విడుదలను తలపించేలా సోషల్ మీడియాలో హంగామా చేశారు.

''సర్కారు వారి పాట'' చిత్రాన్ని 2022 సంక్రాంతి కానుకగా జనవరి 14వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. టీజర్ తోనే ఇది సంక్రాంతి పండుగకు సరైన చిత్రమని తెలిసేలా చేశారు. 'సరిలేరు నీకెవ్వరు' చిత్రంతో గతేడాది సంక్రాంతికి బ్లాక్ బస్టర్ అందుకున్న మహేష్.. ఈసారి ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.

మైత్రీ మూవీ మేకర్స్ - GMB ఎంటర్‌టైన్‌మెంట్ మరియు 14 రీల్స్ ప్లస్ సంస్థలు సంయుక్తంగా 'సర్కారు వారి పాట' చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. నవీన్ యెర్నేని - వై.రవిశంకర్ - రామ్ ఆచంట మరియు గోపీచంద్ ఆచంట నిర్మాతలు. మ్యూజిక్ సెన్సేషన్ ఎస్.ఎస్. థమన్ ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు. ఆర్. మది సినిమాటోగ్రఫీ అందిస్తుండగా.. మార్తాండ్ కె వెంకటేష్ ఎడిటింగ్ వర్క్ చేస్తున్నారు. ఏఎస్ ప్రకాష్ ఆర్ట్ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు.