Begin typing your search above and press return to search.

సర్కారు వారి మాస్ జాతర షురూ అప్పుడేనా?

By:  Tupaki Desk   |   23 Feb 2022 2:30 AM GMT
సర్కారు వారి మాస్ జాతర షురూ అప్పుడేనా?
X
సూపర్‌ స్టార్‌ మహేష్ బాబు హీరోగా కీర్తి సురేష్ హీరోయిన్‌ గా రూపొందుతున్న సర్కారు వారి పాట చిత్రీకరణ ప్రస్తుతం హైదరాబాద్‌ లో జరుగుతోంది. షూటింగ్‌ చివరి దశకు చేరుకున్నట్లుగా సమాచారం అందుతోంది.

పరశురామ్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా నుండి ఇటీవలే కళావతి పాట విడుదల అయ్యింది. థమన్ స్వరపర్చిన ఆ పాటను సిద్‌ శ్రీరామ్‌ ఆలపించాడు. పాట విజువల్స్ మరియు సిద్‌ వాయిస్ అన్ని కూడా ఆ పాటకు హైలైట్‌ గా నిలిచాయి.

కళావతి పాట సూపర్‌ హిట్‌ అయ్యింది. మంచి వ్యూస్ ను దక్కించుకోవడం మాత్రమే కాకుండా లైక్స్‌ విషయంలో రికార్డును సొంతం చేసుకుంది. మహేష్‌ బాబు కెరీర్‌ లో చాలా స్పెషల్‌ మూవీగా సర్కారు వారి పాట ఉంటుంది అంటూ అభిమానుల్లో చిత్ర యూనిట్ సభ్యులు నమ్మకం పెంచారు. థమన్ ఈ ఆల్బమ్‌ తో మరోసారి బిలియన్‌ క్లబ్‌ లో చేరుతాడనే నమ్మకం ను కూడా అభిమానులు మరియు ప్రేక్షకులు వ్యక్తం చేస్తున్నారు.

సర్కారు వారి పాట నుండి ఇటీవల వచ్చిన కళావతి పాటకే అభిమానులు ఆహా ఓహో అంటున్నారు.. అతి త్వరలోనే ఒక మాస్ బిట్‌ రాబోతున్నట్లుగా తెలుస్తోంది. టైటిల్‌ సాంగ్‌ ను మహేష్‌ బాబు అభిమానుల కోసం ఫుల్‌ మాస్‌ గా ట్యూన్‌ చేశాడట. ఐటెం సాంగ్‌ లేని కారణంగా అదే చాలా ప్రత్యేకమైన పాటగా మేకర్స్ చెబుతున్నారు. ఖచ్చితంగా సినిమా లో ఆ పాట స్పెషల్‌ గా ఉంటుందని అంటున్నారు.

భారీ అంచనాలున్న ఆ పాటను విడుదల చేసేందుకు ముహూర్తం ఖరారు అయ్యింది. సినీ వర్గాల నుండి అందుతున్న విశ్వసనీయ సమాచారం ప్రకారం మార్చి రెండవ లేదా మూడవ వారంలో ఈ పాటను విడుదల చేయబోతున్నారు. మార్చి 18వ తారీకున పాట వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాస్త అటు ఇటుగా అయినా పాట మార్చి రెండవ లేదా మూడవ వారంలో రావడం పక్కా అని అభిమానులకు యూనిట్‌ సభ్యులు హింట్‌ ఇస్తున్నారు.

మే 12వ తారీకున సమ్మర్‌ స్పెషల్‌ గా విడుదల కాబోతున్న ఈ సినిమా తో మహేష్‌ బాబు మరోసారి తన బాక్సాఫీస్ స్టామినా చూపించబోతున్నాడు.

సరిలేరు నీకెవ్వరు అనిపించుకున్న దాదాపు రెండున్నర సంవత్సరాల తర్వాత మహేష్ బాబు సర్కారు వారి పాట అంటూ రాబోతున్న నేపథ్యంలో అంచనాలు ఆకాశమే హద్దు అన్నట్లుగా ఉన్నాయి. అంచనాలకు తగ్గట్లుగా గీత గోవిందం దర్శకుడు పరశురామ్ ఈ సినిమా ను తెరకెక్కించి ఉంటాడనే నమ్మకం వ్యక్తం అవుతోంది.