Begin typing your search above and press return to search.
తమిళంలోకి 'సర్కారు వారి పాట'.. టైటిల్ ఇదేనా..?
By: Tupaki Desk | 27 April 2022 8:30 AM GMTసూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ''సర్కారు వారి పాట''. పరశురామ్ పెట్లా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీకి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి.
'సర్కారు వారి పాట' సినిమా మే 12న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఈ చిత్రాన్ని తమిళ్ లో కూడా రిలీజ్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయని టాక్ నడుస్తోంది. తమిళనాడులో తెలుగుతో పాటు తమిళ డబ్బింగ్ వెర్షన్ ను ఒకేసారి విడుదల చేయనున్నారని అంటున్నారు.
మహేష్ బాబుకు తమిళనాడులో మంచి ఫాలోయింగ్ ఉంది. అందుకే అగ్ర హీరో నటించే సినిమాలు క్రమం తప్పకుండా తమిళంలోకి డబ్ చేస్తుంటారు. 'స్పైడర్' సినిమాతో నేరుగా కోలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన మహేష్.. 'శ్రీమంతుడు' చిత్రాన్ని డబ్బింగ్ చేసి రిలీజ్ చేశారు.
మహేశ్ చివరి సినిమా 'సరిలేరు నీకెవ్వరు' ను కరోనా ఫస్ట్ వేవ్ పాండమిక్ తర్వాత ''ఇవణ్ణుకు సరియానా అలిల్లై'' అనే పేరుతో తమిళంలోకి అనువందించారు. తమిళనాట మహేష్ కి ఉన్న మార్కెట్ ని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు ''సర్కారు వారి పాట'' చిత్రాన్ని డబ్బింగ్ చేసి విడుదల చేయనున్నారని తెలుస్తోంది.
తమిళ్ లో ఈ చిత్రానికి తాత్కాలికంగా 'పుదియ అరసాంగం' అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారని టాక్ వినిపిస్తోంది. దీనికి 'కొత్త ప్రభుత్వం' అనే అర్థం వస్తుంది. తమిళనాడు ఏరియాలో ప్రముఖ డిస్ట్రిబ్యూటర్లచే ఈ సినిమా విడుదల కాబోతోందని చెబుతున్నారు. రాబోయే రోజుల్లో తెలుగు ప్రమోషన్స్ తో పాటుగా తమిళ టైటిల్ - పాటలు - ట్రైలర్ మరియు ఇతర అప్‌డేట్‌లు రానున్నాయని నెట్టింట ప్రచారం జరుగుతోంది.
'భరత్ అనే నేను' 'మహర్షి' 'సరిలేరు నీకెవ్వరు' వంటి హ్యాట్రిక్ బ్లాక్ బస్టర్స్ అందుకున్న మహేష్.. ఈసారి ''సర్కారు వారి పాట'' సినిమాతో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందుకుంటారని అభిమానులు భావిస్తున్నారు. ఇందులో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుండగా.. సముద్ర ఖని - ప్రకాష్ రాజ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. తమిళ రిలీజ్ కు మహేశ్ తో పాటుగా వీరు ముగ్గురూ అడ్వాంటేజ్ గా మారే అవకాశం ఉంది.
'సర్కారు వారి పాట' చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ - GMB ఎంటర్‌టైన్‌మెంట్ మరియు 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌లపై రూపొందిస్తున్నారు. నవీన్ యెర్నేని - వై. రవిశంకర్ - రామ్ ఆచంట - గోపీచంద్ ఆచంట సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఎస్ఎస్ థమన్ సంగీతం సమకూరుస్తున్నారు. ఆర్ మధి ఈ సినిమాకు సినిమాటోగ్రఫీ అందించగా.. ఎఎస్ ప్రకాష్ ఆర్ట్ డైరెక్టర్ గా వర్క్ చేశారు. మార్తాండ్ కె వెంకటేష్ ఎడిటింగ్ చూసుకుంటున్నారు.