Begin typing your search above and press return to search.

అలా చేసి ఉంటే 'సర్కారు వారి పాట' కు మరో వంద కోట్లు వచ్చేవి

By:  Tupaki Desk   |   10 July 2022 11:30 PM GMT
అలా చేసి ఉంటే సర్కారు వారి పాట కు మరో వంద కోట్లు వచ్చేవి
X
సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు ఇటీవల సర్కారు వారి పాట సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. పరశురామ్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా లో మహేష్ బాబుకు జోడీగా కీర్తి సురేష్ నటించిన విషయం తెల్సిందే. ఈ సినిమా కు విడుదలైన వెంటనే సోషల్ మీడియాలో నెగిటివ్ టాక్ ను ప్రచారం చేసేందుకు ప్రయత్నించారు. కాని మైత్రి మూవీ మేకర్స్ వారి జోరు ప్రచారం తో సర్కారు వారి పాట కు డ్యామేజీ మరీ ఎక్కువ కాకుండా జాగ్రత్త పడినట్టు అయ్యింది.

సర్కారు వారి పాట సినిమా విడుదల అయిన సమయంలో ప్రేక్షకుల నుండి కూడా మిశ్రమ స్పందన వచ్చింది. రివ్యూలు రకరకాలుగా వచ్చాయి. తాజాగా సర్కారు వారి పాట సినిమా గురించి పరుచూరి పాఠాలు పేరుతో పరుచూరి గోపాలకృష్ణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సినిమాలోని పలు అంశాల గురించి ఆయన తన విశ్లేషణను వీడియో ద్వారా తెలియజేశారు.

దర్శకుడు పరశురామ్‌ సర్కారు వారి పాట సినిమాలో మహేష్ బాబు.. కీర్తి సురేష్ ల యొక్క సన్నివేశాల పై దృష్టి పెట్టి ఉంటే బాగుండేది. ముఖ్యంగా సినిమా ఫస్ట్‌ హాఫ్ లో మహేష్.. కీర్తి సురేష్ ల కాంబోలో హాస్య భరిత సన్నివేశాలు చూపించి.. వెంటనే సెకండ్‌ హాఫ్ కు వచ్చేప్పటికి సీరియస్ గా స్క్రీన్‌ ప్లే నడిచింది. స్క్రీన్ ప్లే ఒక్కసారిగా మారిపోవడంతో ప్రేక్షకులు జీర్ణించుకోలేక పోతున్నారు.

సెకండ్‌ హాఫ్ లో కూడా మహేష్ బాబు.. కీర్తి సురేష్ లకు సంబంధించిన సన్నివేశాలతో కూడా ప్రారంభించి మెల్లగా స్క్రీన్ ప్లేను సీరియస్ గా టర్న్‌ చేసి ఉంటే బాగుండేది అనేది పరుచూరి వారి అభిప్రాయం. సినిమా ను కనుక సెకండ్‌ హాఫ్ లో కూడా ఆసక్తికర ఎలిమెంట్స్ తో హీరో హీరోయిన్‌ పై కామెడీ సన్నివేశాలతో స్క్రీన్‌ ప్లే నడిపి ఉంటే కచ్చితంగా సర్కారు వారి పాట సినిమాకు మరో వంద కోట్ల వరకు అదనంగా వసూళ్లు వచ్చేవి అన్నాడు.

మహేష్ బాబు మరియు కీర్తి సురేష్ ల జోడీకి ఫస్ట్‌ హాఫ్ లో మంచి స్పందన వచ్చింది. అయితే సెకండ్‌ హాఫ్ లో వారి సన్నివేశాల విషయంలో కాస్త ఎబ్బెట్టుగా ఉండేలా సన్నివేశాలను డిజైన్ చేయడం జరిగింది. అందుకే సర్కారు వారి పాట సినిమా కొందరిని నిరాశ పర్చిందనేది కూడా ఆయన అభిప్రాయం. మొత్తానికి సర్కారు వారి పాట సెకండ్ హాఫ్ స్క్రిప్ట్‌ పై ఇంకాస్త వర్క్ చేయాల్సి ఉంది అనేది ఆయన అభిప్రాయం.