Begin typing your search above and press return to search.

ఉత్తరాంధ్రలో సర్కారు వారికి గట్టి దెబ్బ పడిందా..??

By:  Tupaki Desk   |   14 May 2022 2:30 AM GMT
ఉత్తరాంధ్రలో సర్కారు వారికి గట్టి దెబ్బ పడిందా..??
X
సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన 'సర్కారు వారి పాట' సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. ప్రపంచ వ్యాప్తంగా గురువారం గ్రాండ్ గా రిలీజ్ అయిన ఈ చిత్రానికి ఆశించిన టాక్ అయితే రాలేదు. అయినప్పటికీ మహేశ్ స్టార్ డమ్ తో ఓపెనింగ్ డే మంచి కలెక్షన్స్ రాబట్టగలిగింది.

SVP టాక్ ఏంటి.. వరల్డ్ వైడ్ ఎంత కలెక్ట్ చేసిందనేది పక్కన పెడితే.. మిగతా ఏరియాలతో పోల్చుకుంటే మహేష్ సినిమాకు ఉత్తరాంధ్రలో గట్టి దెబ్బ తగిలినట్లు తెలుస్తోంది. దీనికి కారణం తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ కమ్ ఎగ్జిబిటర్ అని అభిమానులు ఆరోపిస్తున్నారు.

వివరాల్లోకి వెళ్తే.. ఉత్తరాంధ్రలో 'సర్కారు వారి పాట' సినిమాకు ఎక్కువ థియేటర్లు కేటాయించలేదు. అక్కడ థియేటర్ వాళ్ళకి డిస్ట్రిబ్యూటర్ కు మధ్య జరిగిన గొడవ వల్ల ఈ పరిస్థితి వచ్చిందని అంటున్నారు. దీంతో మహేశ్ సినిమాకు 25పైగా థియేటర్లు తగ్గాయని తెలుస్తోంది.

సూపర్ స్టార్ ఫ్యాన్స్ మూవీ రిలీజ్ కు ముందు నుంచే ఈ విషయం మీద SVP మేకర్స్ కు సోషల్ మీడియా వేదికగా రిక్వెస్టులు పెట్టారు. ఉత్తరాంధ్రలో ఒక స్టార్ హీరోకి వరస్ట్ రిలీజ్ అని.. వీలైనంత త్వరగా సమస్యను పరిష్కరించాలని కోరారు.

అయితే వివాదం అలానే కొనసాగడంతో 'సర్కారు వారి పాట' సినిమాకు ఆ వ్యక్తి తన థియేటర్లను అనుమతించలేదు. అక్కడ తక్కువ థియేటర్లలోనే మూవీ రిలీజ్ అయింది. తొలి రోజు UA లో ఈ చిత్రానికి 3.73 కోట్లు వచ్చినట్లు నిర్మాతలు ప్రకటించారు.

ఒకవేళ అక్కడ థియేటర్లు దొరికుంటే ఓపెనింగ్ డే నాడు 4.5 కోట్లు పక్కా వచ్చేవని మహేశ్ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. దీనంతటికీ అతనొక్కడే కారణమని ఆరోపిస్తున్నారు.

థియేటర్స్ ఇవ్వకుండా 'సర్కారు వారి పాట' సినిమాని దెబ్బేసాడని.. థియేటర్లను లీజుకి తీసుకొని మాఫియాని బాగానే నడుపుతున్నాడని విమర్శిస్తున్నారు. మరి రాబోయే రోజుల్లో ఉత్తరాంధ్రలో SVP వసూళ్ళు ఎలా ఉంటాయో.. అతనిపై ఇంకెన్ని ట్రోల్స్ వస్తాయో చూడాలి.