Begin typing your search above and press return to search.
శ్రీదేవి నిజాయితీ అప్పుడే తెలిసింది
By: Tupaki Desk | 1 March 2018 6:54 AM GMTఅందాల నటి శ్రీదేవి గురించి ఎంత చెప్పినా కూడా తక్కువే. నటనలో అన్ని కోణాలను తనదైన శైలిలో చూపించి దేశమంతటా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఆమె మరణం అందరికి ఒక చేదు జ్ఞాపకం. కానీ ఆమె చేసిన సినిమాల కారణంగా ఆ చేదు జ్ఞాపకాన్ని కొంచెం అయినా తగ్గిస్తుంది. అయితే శ్రీదేవి గురించి మొన్నటి వరకు ఎలాంటి న్యూస్ వచ్చినా అంతగా వైరల్ అవ్వలేదు.
ఎప్పుడైతే ఆమె తుది శ్వాస విడిచారో అప్పటి నుంచి చిన్న న్యూస్ బయటకి వచ్చినా వైరల్ అవుతోంది. ప్రతి ఒక్క సెలబ్రేటీ శ్రీదేవితో గడిపిన మధుర క్షణాలను గుర్తు చేసుకుంటున్నారు. ఇకపోతే అప్పట్లో ఎన్నో బాలీవుడ్ సినిమాలకు కొరియోగ్రాఫర్ గా వర్క్ చేసిన సరోజ్ ఖాన్ రీసెంట్ గా శ్రీదేవి గురించి ఎవరు ఉహించని నిజాన్ని తెలిపింది. ఆమె అంత మంచి డ్యాన్సర్ కాదు అని ఆమె తెలియజేశారు. శ్రీదేవి సరోజ్ మంచి స్నేహుతులని బాలీవుడ్ లో అందరికి తెలిసిన విషయమే.
రీసెంట్ గా ఇచ్చిన ఇంటర్వ్యూలో సరోజ్ ఖాన్ మాట్లాడుతూ.. కర్మ సినిమాకు నేను కొరియోగ్రాఫర్ గా వర్క్ చేస్తున్నప్పుడు మొదటి సారి శ్రీదేవిని చూశాను. రామ్ సే తుజే సుభాష్ గై అనే పాటకు కొరియోగ్రఫీ చేస్తున్నప్పుడు శ్రీదేవి మొత్తం సౌత్ స్టైల్ లో మూమెంట్స్ ఇచ్చింది. రీ టెక్స్ చాలానే తీసుకున్నా కూడా శ్రీదేవి ఏ మాత్రం నో చెప్పకుండా కష్టపడింది. చివరగా నా దగ్గరకు వచ్చి సరోజ్ జీ నేను అంత మంచి డ్యాన్సర్ ని కాను ఒకసారి రిహార్సల్స్ ఇవ్వండి అని శ్రీదేవి చెప్పింది. దీంతో ఆమె నిజాయితీ ఏమిటో అర్థమైంది. అప్పటి నుంచి మేమిద్దరం చాలా క్లోజ్ అయ్యమని సరోజ్ తెలియజేశారు.