Begin typing your search above and press return to search.
ఆ సూపర్ హిట్ సినిమాకి సీక్వెల్... ఆ ఒక్క మార్పు?
By: Tupaki Desk | 8 March 2023 8:00 AM GMTతమిళ ప్రముఖ దర్శకుల్లో పా రంజిత్ ఒకరు అనడంలో సందేహం లేదు. ఆయన సినిమాల్లో మ్యాటర్ తప్పకుండా ఉంటుంది. ప్రతి సినిమాలో కూడా విభిన్నమైన కాన్సెప్ట్ ను ప్రేక్షకులకు చూపించడం ఆయనకే చెల్లిందని అభిమానులు అంటూ ఉంటారు. కరోనా సమయంలో పా రంజిత్ నుండి వచ్చిన సినిమా 'సార్పట్ట'.
ఆర్య హీరోగా నటించిన పీరియాడిక్ బాక్సింగ్ డ్రామా ఓటీటీ లో స్ట్రీమింగ్ అయ్యి భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. థియేటర్ రిలీజ్ అయ్యి ఉంటే కచ్చితంగా వంద కోట్ల వసూళ్లు నమోదు అయ్యేవి అనేది ఇండస్ట్రీ వర్గాల మాట. తమిళంతో పాటు తెలుగు లో కూడా ఈ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది.
సార్పట్ట సినిమా యొక్క స్పందన నేపథ్యంలో సీక్వెల్ చేయాలని మేకర్స్ గత కొన్ని రోజులుగా ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రేక్షకులు కూడా సార్పట్ట సినిమా యొక్క సీక్వెల్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎట్టకేలకు సీక్వెల్ యొక్క అఫిషియల్ అనౌన్సమెంట్ వచ్చింది.
సీక్వెల్ లో ఒక్క విషయం మినహా అంతా సేమ్ అన్నట్లుగా ఉండబోతున్నట్లుగా తెలుస్తోంది. ఆ ఒక్క విషయం ఏంటి అంటే.. సార్పట్ట సినిమాకు సంగీతాన్ని సంతోష్ నారాయణ్ అందించారు. ఆ సినిమాలోని బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో సినిమా స్థాయిని పెంచడం జరిగింది. కానీ సీక్వెల్ లో సంతోష్ నారాయణన్ కాకుండా మరో మ్యూజిక్ డైరెక్టర్ వర్క్ చేయబోతున్నట్లుగా తమిళ మీడియా సర్కిల్స్ లో ప్రచారం జరుగుతోంది. సంతోష్ నారాయణన్ స్తాయిలో ఎవరు సార్పట్ట సీక్వెల్ కి సంగీతాన్ని అందిస్తారు అనేది చూడాలి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.