Begin typing your search above and press return to search.

బొలీవియా పాట గొప్పగా లేదేంటి?

By:  Tupaki Desk   |   23 April 2016 11:30 AM GMT
బొలీవియా పాట గొప్పగా లేదేంటి?
X
సరైనోడు టీం రిలీజ్ కు ఓ నెల్లాళ్ల ముందు ఓ సుదీర్ఘ ప్రయాణం చేసింది. ఓ పాట కోసం బొలీవియా చేరుకునేందుకు చాలానే కష్టాలు పడింది. 2 రోజుల ప్రయాణం - 11 గంటల వెయిటింగ్ - 8 గంటల కార్ ప్రయాణం తర్వాత.. సలార్ దె ఉయినికి చేరుకుని ఓ పాటను పిక్చరైజ్ చేశారు. అల్లు అర్జున్ - రకుల్ ప్రీత్ సింగ్ ల మధ్య రొమాంటిక్ సాంగ్ తెలుసా తెలుసా కోసం ఈ కష్టమంతా.

ఉప్పుతో కప్పేసిన తెల్లటి స్వర్గం లాంటి ప్రదేశమే ఈ ఉయిని. ఆడియో పరంగా ఆకట్టుకున్న ఈ సాంగ్.. విజువల్ గా మరింత గొప్పగా ఉంటుందని ఎక్స్ పెక్ట్ చేయడం సహజం. కానీ ఆన్ స్క్రీన్ పై కూడా ఆకట్టుకున్నది మ్యూజిక్ మాత్రమే. విజువలైజేషన్ సాధారణంగానే ఉంది. ఇంకా చెప్పాలంటే అల్లుడు శీను లో బెల్లంకొండ శ్రీనివాస్ - సమంతల మధ్య వచ్చే నీలి నీలి పాటకు జిరాక్స్ లా అనిపించిందనే టాక్ వినిపిస్తోంది. అల్లుడు శీను అంతా గ్రాఫిక్స్ లో తీసేయగా.. సరైనోడు కోసం నిజంగానే ఆ ప్రాంతానికి వెళ్లి షూటింగ్ చేసుకొచ్చారు. ఇంత కష్టపడి మరీ విజువలైజేషన్ చేయలేకపోవడం ఆశ్చర్యకరం.

నిజానికి ఇలా రియల్ గా ఆ ప్రదేశాలకు వెళ్లి తీయడంలో శంకర్ సిద్ధహస్తుడు రోబో సాంగ్స్ పెరులోను మాచు పిచ్చు - బ్రెజిల్ లో తీసిన మాటలు మైండ్ బ్లోయింగ్ అనిపిస్తాయి. ఆ రేంజ్ కాకపోయినా.. కనీసం సరైనోడు టీం చెప్పిన మేరకైనా బొలీవియా అందాలను ప్రెజెంట్ చేయలేకపోవడం ఆశ్చర్యకరం.