Begin typing your search above and press return to search.
బాహుబలి ఔట్.. సరైనోడు ఇన్
By: Tupaki Desk | 3 July 2016 6:32 AM GMTబాహుబలి ఔట్ అవ్వడమేంటి.. సరైనోడు ఇన్ అవ్వడమేంటి అంటారా..? అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఈ మాటే అంటున్నారు మరి. విజయనగరం జిల్లా టౌన్లో ‘బాహుబలి’ కలెక్షన్ల రికార్డును ‘సరైనోడు’ బద్దలు కొట్టేసిందట. ఈ టౌన్లో ‘సరైనోడు’ 1 కోటి 20 లక్షల 64 వేల 161 రూపాయల గ్రాస్ వసూలు చేసి ‘బాహుబలి’ వసూళ్లను దాటేసిందట. విజయనగర సినీ సామ్రాజ్యం నుంచి ‘బాహుబలి’ ఔట్.. ‘సరైనోడు’ ఇన్ అంటూ ఈ టౌన్ అంతటా బన్నీ ఫ్యాన్స్ ఫ్లెక్సీలు పెట్టి మరీ ప్రచారం చేస్తున్నారు. విజయనగరంతో పాటు శ్రీకాకుళంలోనూ ‘సరైనోడు’ సంచలన రికార్డులు సాధించిందటూ ఈ ఫ్లెక్సీలో పేర్కొన్నారు.
ఐతే ఇది అభిమానులు చెబుతున్న లెక్క. అధికారిక కలెక్షన్ల వివరాలు తెలియాల్సి ఉంది. ఉత్తరాంధ్రలో ‘సరైనోడు’ నాన్ బాహుబలి రికార్డుల్ని బద్దలు కొట్టడం వాస్తవం. ఇక్కడ రూ.8 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసి ‘మగధీర’ పేరిట ఉన్న నాన్-బాహుబలి రికార్డును ఆల్రెడీ బద్దలు కొట్టేసింది ‘సరైనోడు’. ఉత్తరాంధ్ర జిల్లాల్లో బన్నీ సినిమాలకు క్రమక్రమంగా ఆదరణ పెరుగుతోంది. పవన్ కళ్యాణ్ స్థాయిలో ఇక్కడ బన్నీ ఫాలోయింగ్ పెంచుకున్నాడు. ఐతే అంతా బాగానే ఉంది కానీ.. అసలే హీరోల అభిమానుల మధ్య వార్స్ పెరిగిపోతున్న టైంలో ఇలా ‘బాహుబలి ఔట్.. సరైనోడు ఇన్’ తరహా ఫ్లెక్సీలు పెట్టడం.. ఇలా అవతలి హీరోల అభిమానుల్ని కవ్వించడం కరెక్టా అన్న చర్చ జరుగుతోంది. ఇంతకుముందు ప్రభాస్-పవన్ కళ్యాణ్ అభిమానుల మధ్య వార్ నడవగా.. ఇప్పుడు బన్నీ ఫ్యాన్స్ తయారయ్యారు.