Begin typing your search above and press return to search.

సరైనోడికి ఇంకో ట్రైలర్ వస్తోంది

By:  Tupaki Desk   |   15 April 2016 1:00 PM IST
సరైనోడికి ఇంకో ట్రైలర్ వస్తోంది
X
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, -బోయపాటి శ్రీను కాంబినేషన్ లో రూపొందిన సరైనోడు ఏప్రిల్ 22న విడుదల కానుంది. వారంలో రిలీజ్ ఉండగా.. ఇప్పుడు మూవీకి మరో ట్రైలర్ విడుదల చేసేందుకు యూనిట్ రెడీ అవుతోంది. దీనికి కారణం ఓవర్సీస్ బయ్యర్సే అంటున్నారు.

ఇప్పటికే విడుదల చేసిన సరైనోడు ట్రైలర్ చూస్తే.. ఒకటే కంటెంట్ కనిపిస్తుంది. ఫుల్ ప్లెడ్జెడ్ గా యాక్షన్ సీన్స్ తోనే ట్రైలర్ నింపేశారు. ఇది బీ - సీ సెంటర్ల ఆడియన్స్ ను థియేటర్లకు రప్పించడానికి బాగానే ఉంటుంది కానీ.. ఓవర్సీస్ జనాలకు నచ్చే వ్యవహారం కాదు. బన్నీ వరుసగా హిట్స్ కొడుతుండడంతో.. ఇప్పటికే భారీ రేటుకు సరైనోడు రైట్స్ తీసుకోవడం, దాన్ని రీసేల్ చేయడం కూడా జరిగిపోయాయి.

ఓన్లీ యాక్షన్ అంటే.. ఫ్యామిలీ జనాలు థియేటర్లకు రారనే బెంగ మొదలైపోయింది యూఎస్ డిస్ట్రిబ్యూటర్లకి. అందుకే కలర్ ఫుల్ గా ఉండే ట్రైలర్ ఇవ్వాలని నిర్మాతలను పదేపదే కోరుతున్నారు. ఇప్పుడు టీం కూడా అదే పనిలో ఉంది. ఒకట్రెండు రోజుల్లో ఫ్యామిలీ ఆడియన్స్ కి నచ్చేలా ట్రైలర్ ని విడుదల చేసే ఛాన్స్ ఉంది.