Begin typing your search above and press return to search.
సరైనోడి 54 కోట్ల బ్రేకప్ ఇదే
By: Tupaki Desk | 3 May 2016 5:05 AM GMTసరైనోడు పవర్ చూపిస్తున్నాడు. స్ట్రాంగ్ కాదు.. సూపర్ స్ట్రాంగ్ గా ఉంటున్నాయి వసూళ్లు. రెండో వారాంతంలో కూడా కలెక్షన్స్ కుమ్మేయడంతో.. ఇప్పటికే సేఫ్ జోనర్ లోకి వచ్చేశాడు అల్లు అర్జున్ సరైనోడు. బోయపాటి దర్శకత్వంలో బన్నీ నటించిన ఈ మూవీనీ ప్రపంచవ్యాప్తంగా 54 కోట్లకు విక్రయించిన విషయం తెలిసిందే. ఇప్పుడు 10వ రోజుకే ఈ 54 కోట్ల మొత్తాన్ని ''షేర్'' రూపంలో లాగేసి, బాక్సాఫీస్ కి సరైనోడు అనిపించుకున్నాడు బన్నీ.
సరైనోడుకి నైజాం నుంచి 13.97 కోట్ల షేర్ వసూళ్లు రాగా - సీడెడ్ నుంచి 8.18 కోట్లు రావడం అందరినీ ఆశ్చర్యపరిచింది. వైజాగ్ ఏరియాకి 5.52 కోట్లు - ఈస్ట్ 3.54 కోట్లు - వెస్ట్ 3.10 కోట్లు - కృష్ణా 2.84 కోట్ల కలెక్షన్స్ రాగా.. గుంటూరు 3.87 కోట్లు - నెల్లూరు నుంచి 1.64 కోట్లు వచ్చాయి. మొత్తంగా ఏపీ - తెలంగాణల నుంచి 42.66 కోట్లు వసూలు చేసి.. ఈ ఏడాది అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా రికార్డ్ సృష్టించాడు సరైనోడు.
కర్నాటక 6.65 కోట్లు - రెస్టాఫ్ ఇండియా 1.30 కోట్లు - అమెరికా 2.83 కోట్లు - ఓవర్సీస్ 0.80 కోట్ల వసూళ్లతో ప్రపంచవ్యాప్తంగా 54.24 కోట్లు కొల్లగొట్టి.. సేఫ్ జోనర్ లోకి వచ్చేయడంతో.. బయ్యర్లు - డిస్ట్రిబ్యూటర్లు ఫుల్లు హ్యాపీగా ఉన్నారు. చాలా ఏరియాల్లో ఇప్పటికే ప్రాఫిట్ జోనర్ లోకి ఎంటర్ అవడం, ఈ వారం కూడా సత్తా చాటుతుండడంతో.. సరైనోడుతో లాభాల పంట ఖాయం అయిపోయింది.