Begin typing your search above and press return to search.
నాలుగోవారంలో స్క్రీన్లు పెంచుతున్నారా?
By: Tupaki Desk | 12 May 2016 9:25 AM GMTసినీ రంగంలో 50 రోజులు.. 100 రోజుల మాటలు మరిచిపోయి చాలా కాలమైంది. పాజిటివ్ టాక్‌తో మొదలైన సినిమాలకు సైతం మూడో వారానికి బొమ్మ తిరగబడిపోయే పరిస్థితి కనిపిస్తోంది కొన్నేళ్లుగా. ఐతే ఈ మధ్య మళ్లీ ట్రెండు మారుతున్నట్లుంది. కంటెంట్ ఉన్న సినిమాలు మూణ్నాలుగు వారాల తర్వాత కూడా సత్తా చాటుకుంటున్నాయి. సంక్రాంతికి వచ్చిన ‘సోగ్గాడే చిన్నినాయనా’ 50 రోజులకు కూడా మంచి కలెక్షన్లతో అదరగొట్టింది. ఆ తర్వాత ‘ఊపిరి’ సైతం అలాగే సత్తా చాటింది. ఐతే ఆ రెండు సినిమాలూ పూర్తి పాజిటివ్ టాక్ తో మొదలయ్యాయి కాబట్టి అలా హవా సాగించడంలో ఆశ్చర్యం లేదు.
ఐతే డివైడ్ టాక్ తో మొదలైన ‘సరైనోడు’ సైతం నాలుగో వారంలోనూ మంచి కలెక్షన్లు సాధిస్తుండటం విశేషం. గత వారం సుప్రీమ్.. 24 సినిమాలు బాక్సాఫీస్ మీదికి దండెత్తిన నేపథ్యంలో ‘సరైనోడు’ స్క్రీన్లను బాగా తగ్గించేశారు. ఇక ఈ సినిమా కథ ముగిసినట్లే అనుకున్నారు. ఐతే థర్డ్ వీకెండ్ లో సైతం ‘సరైనోడు’ మంచి కలెక్షన్లే సాధించడంతో మళ్లీ ఇప్పుడు స్క్రీన్లు పెంచుతున్నారు. హైదరాబాద్ లో ఈ సినిమాకు నాలుగో వారం 4 స్క్రీన్లు పెంచడం విశేషం. ఎ క్లాస్ సెంటర్లలో ‘సుప్రీమ్’ స్క్రీన్లను కొంచెం తగ్గించి ‘సరైనోడు’కు ఇస్తుండటగా.. మాస్ సెంటర్లలో ‘24’ థియేటర్లకు కోత పడుతోంది.
ఈ వారం పెద్దగా పేరులేని తమిళ డబ్బింగ్ సినిమాలు మినహా తెలుగు సినిమాలేవీ రిలీజ్ కాకపోవడం ‘సరైనోడు’కు కలిసొస్తోంది. బి, సి సెంటర్లలో కొత్త సినిమాల పోటీని తట్టుకుని ‘సరైనోడు’ చెప్పుకోదగ్గ షేర్ కలెక్ట్ చేస్తుండటం విశేషం. నిన్న కృష్ణా జిల్లాలో ‘24’ సినిమాకు 9 లక్షల షేర్ వస్తే.. ‘సరైనోడు’కు 4 లక్షల దాకా షేర్ రావడం విశేషం.