Begin typing your search above and press return to search.
చిరంజీవికి సరైనోడి ట్రీట్
By: Tupaki Desk | 21 April 2016 11:30 AM GMTతన మేనల్లుడి కెరీర్లోనే అత్యంత హైప్ మధ్య.. అత్యంత భారీ స్థాయిలో విడుదలవుతున్న సినిమా ఎలా ఉందో చూద్దామనుకున్నాడో లేక.. బోయపాటితో పని చేసే ఆలోచన విషయంలో సీరియస్ గా ఉన్నాడో.. కారణమేదైనా కానివ్వండి.. మెగాస్టార్ చిరంజీవి ‘సరైనోడు’ సినిమాను అందరికంటే ముందు చూసిన ప్రేక్షకుడు కావాలనుకున్నట్లు సమాచారం. గురువారం సాయంత్రం ఆయనకు ‘సరైనోడు’ స్పెషల్ స్క్రీనింగ్ ఏర్పాటు చేశారట అల్లు అరవింద్.
చిరంజీవితో పాటు ఆయన సన్నిహితులు.. కుటుంబ సభ్యులు కొందరు సినిమా వీక్షిస్తునట్లు తెలిసింది. మరి సినిమా చూశాక చిరు తన స్పందనను మీడియాతో పంచుకుంటాడో లేదో చూడాలి. ఈ సినిమా నచ్చితే తన 151వ చిత్రాన్ని బోయపాటికే అప్పగించే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ‘సరైనోడు’ కథను చిరునే ముందు విని.. గ్రీన్ సిగ్నల్ ఇచ్చాక.. ఆ ప్రాజెక్టును పట్టాలెక్కించారు అల్లు అరవింద్. తన ‘అన్నయ్య’ సినిమాకు అసోసియేట్ డైరెక్టర్ గా పని చేసిన బోయపాటి మీద చిరుకి బాగానే గురి ఉంది.
ఇక చిరు కోసం వేసిన షో సంగతి పక్కనబెడితే.. రెండు తెలుగు రాష్ట్రాల్లో అర్ధరాత్రి నుంచే ‘సరైనోడు’ సందడి మొదలు కానుంది. చాలా చోట్ల అభిమానుల కోసం పెద్ద ఎత్తున బెనిఫిట్ షోలు ప్లాన్ చేశారు. ఈ షోలు మొదలవడానికి ముందే యుఎస్ లో ప్రిమియర్ షోలు పడిపోతున్నాయి. అక్కడ మొత్తం 160కి పైగా లొకేషన్ లలో ‘సరైనోడు’ ప్రిమియర్ షోలు వేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ‘సరైనోడు’ తెలుగు వెర్షన్ మాత్రమే 1600 స్క్రీన్లలో రిలీజవుతోంది.