Begin typing your search above and press return to search.
సర్రయినోడు.. ధియేటర్ దద్దరిల్లిపోతోంది
By: Tupaki Desk | 20 Feb 2016 4:23 AM GMTమామూలుగా సౌండ్ ను సింథసైజ్ చేసి బ్యాగ్రౌండ్ స్కోర్ కొట్టమంటే మాత్రం.. అందులో తమన్ బాబు దిట్ట. ఇక ''సరైనోడు'' సినిమా టీజర్ కోసం మనోడు ఇచ్చిన సౌండ్ తాలూకు పంచ్ ఎలా ఉందో తెలుసా? అదే విధంగా రత్నం రాసిన డైలాగు ఎలా అనిపిస్తోందో తెలుసా? బోయపాటి టేకింగ్.. బన్నీ యాక్టింగ్.. గీతా ఆర్ట్స్ ప్రొడక్షన్ వాల్యూ.. మొత్తంగా అన్నీ కలిపి దద్దరిల్లేలా చేస్తున్నాయి.
ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్ తెలంగాణల్లోని దాదాపు అన్ని ధియేటర్లలో ప్రదర్శితమవుతోంది సరైనోడు టీజర్. సర్ ర్ ర్ అంటూ మొదలయ్యే ఈ టీజర్.. సౌండ్ తో మొదట చంపేస్తే.. తరువాత.. 'ఎర్ర తోలు.. మాస్.. ఊరర.. మాస్ స్..' అంటూ అల్లు అర్జున్ డైలాగ్ తో అదిరిపోతోంది. ధియేటర్ లో టీజర్ చూసిన వారందరికీ ఒకటే ఫీలింగ్.. ఈసారి బన్నీ ఓ పెద్ద హిట్ కొడుతున్నాడు. ఈ రేంజులో మాస్ మసాలా ఉంటే.. ఇక ధియేటర్స్ లో రచ్చ రంబోలా అంటున్నారు.
ఇప్పటికే రేసుగుర్రం - సన్ ఆఫ్ సత్యమూర్తి సినిమాలతో వరుస బ్లాక్ బస్టర్లు కొట్టాడు. ఇప్పుడు సరైనోడు తో కూడా సోలో సినిమాల్లో వరుస హిట్లు కొట్టి హ్యాట్రిక్ కొట్టేస్తాడా? ఏమో చెప్పలేం. ఖచ్చితంగా కొట్టేస్తాడనే టీజర్ చూసిన వారి ఫీలింగ్. ఒకవేళ ఈసారి 50 కోట్లు క్లబ్ దాటేసి ఏ 60 లేదా70కి వెళ్తాడేమో.. చెప్పలేం. లెటజ్ సీ.