Begin typing your search above and press return to search.
'శంకరాభరణం' మ్యాజిక్ చేస్తుందా?
By: Tupaki Desk | 4 March 2019 4:24 PM GMTసంగీత దర్శకుడిగా పరిచయమై అటుపై హీరోగా మారాడు జీవీ ప్రకాష్ కుమార్. ఏ.ఆర్.రెహమాన్ మేనల్లుడిగా ప్రపంచానికి సుపరిచితం. జీవీ ప్రకాష్ ఇటీవల కొన్ని ఫక్తు కమర్షియల్ చిత్రాల్లో నటించి తమిళ తంబీల్ని మెప్పించాడు. ఉన్నట్టుండి ఏమైందో సడెన్ గా యూటర్న్ తీసుకుని ఇప్పుడు ఓ కొత్త ప్రయోగంతో తెలుగు, తమిళ ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. జీవీ ప్రకాష్ నటించిన `సర్వం తాళమయం` ఫిబ్రవరి 1న తమిళ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రస్తుతం తెలుగులో అదే టైటిల్ తో అనువాదమై రిలీజవుతోంది. మహాశివరాత్రి కానుకగా తెలుగు ట్రైలర్‌ను చిత్ర బృందం విడుదల చేసింది.
మృదంగం తయారీ కుటుంబంలో జన్మించిన ఓ దళితుడైన యువకుడు గొప్ప వాయిద్య కారుడిగా ఎదగాలని కలగంటే అటుపై పర్యవసానాలేంటి? అన్నదే ఈ సినిమా కథాంశం. కర్నాటక సంగీతం అనేది కేవలం ఒక కులానికి మాత్రమే అని భావించే రోజుల నుంచి స్వరం అందరిదీ అనేంత వరకూ కాలం మారినా .. ఇంకా ఎక్కడో ఆ అస్పృశ్యత సమాజంలో మిగిలే ఉంది అన్న పాయింట్ ని ఈ ట్రైలర్ టచ్ చేసింది. వాయిద్యాల కుటుంబంలో జన్మించిన పీటర్ జాన్సన్ సంగీతం నేర్చుకున్నాడా లేదా? అందుకోసం ఎవరివరిని అతడు కలిసాడు? అన్నది ట్రైలర్ లో చూపించారు. ఆసక్తికరంగా ఈ చిత్రంతో చాలా గ్యాప్ తర్వాత `ప్రేమదేశం` హీరో వినీత్ రీఎంట్రీ ఇస్తున్నాడు. ప్రఖ్యాత సినిమాటోగ్రాఫర్ రాజీవ్ మీనన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. మైండ్ స్క్రీన్ ఫిల్మ్ ఇనిస్టిట్యూట్ పతాకంపై లతా మేనన్ నిర్మిస్తున్నారు. ఏఆర్ రెహమాన్ సంగీతం సమకూర్చారు. త్వరలోనే తెలుగులోనూ ఈ సినిమా రిలీజ్ కి రెడీ అవుతోంది. ఇటీవలే రాజీవ్ మీనన్ హైదరాబాద్ మీడియా ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే.
సంగీతంపై ఎన్నో సినిమాలు వచ్చాయి. అయితే ఇందులో దళితుడు అనే పాయింట్ ఆసక్తికరం. సంగీతం .. దళిత కులం కాన్సెప్టు కొత్తేమీ కాదు .. కళాతపస్వి కె.విశ్వనాథ్ ఇదివరకూ స్పర్శించిన పాయింటే. అయితే రాజీవ్ మీనన్ ఈ చిత్రాన్ని ఎంత గొప్పగా చూపించగలిగారు? కమర్షియల్ గా మెప్పిస్తుందా? అన్నది వేచి చూడాల్సిందే.