Begin typing your search above and press return to search.
శశివదనే టీజర్ టాక్: ప్రేమించాలని డిసైడైతే యుద్ధం చేయాలంతే!
By: Tupaki Desk | 16 Sep 2021 12:03 PM GMTకొన్ని సెకన్ల ఇంటెన్స్ టీజర్ తో కట్టి పడేయడమెలానో ఈ టీజర్ చూసి చెప్పొచ్చు. సినిమాలో కంటెంట్ ఏమిటి? కాన్సెప్ట్ ఏమిటో సింపుల్ గా చెప్పేయొచ్చనడానికి ఇది మంచి ఎగ్జాంపుల్. పలాస 1978 హీరో రక్షిత్ నటిస్తున్న తాజా చిత్రం శశివదనే. కోమలి ప్రసాద్ కథానాయిక. ఏజీ ఫిలిమ్ కంపెనీ నిర్మిస్తోంది. టైటిల్ కి తగ్గట్టే ఇది డీప్ ఇంటెన్స్ లవ్ స్టోరీతో తెరకెక్కనుంది. ఇది స్కూల్ కాలేజ్ స్టూడెంట్స్ లవ్ స్టోరి అని టీజర్ లో యూనిఫామ్ ను బట్టి అర్థమవుతోంది. అంతేకాదు .. ఇందులో యథావిధిగా విలేజ్ నేపథ్యంలో కులాంతర ప్రేమకథను చూపించబోతున్నారని హీరో డైలాగులు ఎంపిక చేసిన లొకేషన్లు వెల్లడిస్తున్నాయి.
``రేయ్.. రోజూ ఆ అమ్మాయి వెనక తిరుగతున్నావ్. ఏదో రోజు నీకు పడుద్దనుకుందాం. వెనకాలోళ్లను ఎలా ఒప్పిస్తావ్ రా...`` అని ఫ్రెండు అడిగితే దానికి హీరో చెప్పిన డైలాగ్ ఇదీ...!
``ఏముందిరా.. వాళ్ల కాస్ట్ కాదనుకో మన కులపోడు కాదంటారు. ఒకవేళ వాళ్ల కులమే అయినా మన స్థాయి కాదంటారు. కానీ కులాన్ని స్థాయిని చూసి ప్రేమ పుట్టదు కదరా! ప్రేమించాలని డిసైడ్ అయ్యామంటే ఎన్నొచ్చినా యుద్ధం చేయాలంతే`` అంటూ థీమ్ ని ఒక్క డైలాగ్ తో చెప్పాడు.
రక్షిత్ వాయిస్ తో ఈ టీజర్ ని ఆవిష్కరించిన తీరు బావుంది. ఇక ప్రేమకథ గట్టిగా కనెక్టయితే యూత్ ఎప్పుడూ ఆదరిస్తుందనడానికి ఉప్పెన సక్సెస్ ఎగ్జాంపుల్. మంచి పాటలు సంగీతం అదనపు బలంగా మారతాయి. మరి శశివదనే అంటూ క్లాసిక్ టైటిల్ ని ఎంపిక చేసుకున్న ఈ టీమ్ ఎలాంటి కంటెంట్ ని అందించనుందో చూడాలి. త్వరలోనే షూటింగ్ ప్రారంభం కానుంది. బెల్లంకొండ అహితేజ్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి సాయి మోహన్ ఉబ్బన దర్శకుడు. అతడే రచన అందించారు. శరవణ వసుదేవన్ సంగీతం అందిస్తున్నారు.