Begin typing your search above and press return to search.

బాస్ ప్ర‌శంస‌ల‌కోసం శాస్త్రీగారు వెయిటింగ్!

By:  Tupaki Desk   |   15 Sep 2022 6:41 AM GMT
బాస్ ప్ర‌శంస‌ల‌కోసం శాస్త్రీగారు వెయిటింగ్!
X
మెగాస్టార్ చిరంజీవి సినిమా అంటే మ్యూజిక‌ల్ గా ముందే సెన్సేష‌న్ క్రియేట్ చేయ‌డం అన్న‌ది ఓ అన‌వాయితీ. కంటెంట్ ఎలా ఉన్నా అడ్వాన్స్ గా సంగీతంతో శ్రోత‌ల్ని అల‌రించాలి. ఆ త‌ర్వాత జ‌నాలు కంటెంట్ గురించి ఆలోచించాలి? అన్న‌ది మెగ‌స్టార్ స్ర్టాట‌జీ. మెగాస్టార్ ఎన‌ర్జిటిక్ స్టెప్పుల‌తో సినిమాకి ముందే ఓ ఊపు తీసుకురావాల‌న్న‌ది ఎప్ప‌టి నుంచో అనుస‌రిస్తోన్న విధానం.

అందుకే చిరంజీవి సినిమాకి పాట‌లు రాయాల‌న్నా....డాన్స్ కంపోజ్ చేయాల‌న్నా? అంతా ఉద్ద‌డుంలై ఉండాలి. టెక్నిక‌ల్ గా సినిమాని జ‌నాల్లోకి తీసుకెళ్లాలంటే? అదే ప్ర‌ధ‌మం అని బ‌లంగా న‌మ్మే వ్య‌క్తి. అన్న‌య్య మ‌రో 150 సినిమాలు చేసినా? అందులో సంగీత ప్రియ‌కుల‌కు కావాల్సిన ఎగ్జైట్ మెంట్ త‌ప్ప‌న‌సరిగా ఉండాల్సిందే. తాజాగా గీత ర‌చ‌యిత రామ‌జోగ‌య్య శాస్త్రీ అలాంటి ఎగ్టైమెంట్ తోనే ఎదురుచూస్తున్న‌ట్లు క‌నిపిస్తుంది.

ప్ర‌స్తుతం చిరంజీవి క‌థానాయ‌కుడి మోహ‌న్ రాజా ద‌ర్శ‌క‌త్వంలో 'గాడ్ పాద‌ర్' తెర‌కెక్కుతోన్న సంగ‌తి తెలిసిందే. ఇటీవ‌లే చిత్రీక‌ర‌ణ పూర్తిచేసుకున్న సినిమా పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నుల్లో ఉంది. తాజాగా సినిమాకి సంబంధించి ఇంట్రెస్టింగ్ అప్ డేట్ ఒక‌టి వైర‌ల్ అవుతోంది. ఈ సినిమాకి రామ‌జోగ‌య్య శాస్త్రీ కొన్ని పాట‌లు రాసారు. వాటికి థ‌మ‌న్ సంగీతం మస‌మ‌కూర్చారు.

తాజాగా థ‌మ‌న్ తో త‌ను అనుభూతిని శాస్త్రీగారు ట్విట‌ర్ వేదిక‌గా షేర్ చేసుకున్నారు. ఎంతో సంతృప్తిని క‌లిగించే పాట‌ల‌కు ఈ సినిమాకి కుదిరాయి. వాటికి థ‌మ‌న్ మంచి ట్యూన్స్ అందించారు. రీ-రికార్డింగ్..బిట్ సాంగ్స్ అన్నీ చ‌క్క‌గా కుదిరాయి. వాటిని బాస్ ఎప్పుడు వింటారా? అని ఎదురుచూస్తున్నా. అంత మంచి కంటెంట్ ఈ సినిమాకి కుదిరింది.

థ‌మ‌న్ సంగీతాన్ని ఎప్పుడు ఆస్వాదిస్తాను. అత‌నితో ప‌నిని ఆస్వాదిస్తాను. థ‌మ‌న్ స్కోర్ సినిమాకి ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ తీసుకొస్తుంది. థ‌మ‌న్ కి కృత‌జ్ఞ‌త‌లు" తెలియ‌జేసారు. ఇక చిత్రాన్ని ద‌సరా కానుక‌గా ఆక్టోబ‌ర్ 5న రిలీజ్ చేస్తున్నారు.

ఇప్ప‌టికే రిలీజ్ అయిన ప్ర‌చార చిత్రాలు సినిమాపై అంచనాలు అంత‌కంత‌కు పెంచేస్తున్నాయి. ప్ర‌స్తుతం మెగా అభిమానులు పాట‌ల రిలీజ్ కోసం ఎంతో ఎగ్జైట్ మెంట్ తో ఎదురుచూస్తున్నారు. ఈ సంద‌ర్భంలో శాస్త్రీగారి అప్ డేట్ మ‌రింత క్యూరియాసిటీని రెట్టింపు చేస్తుంది. మ‌రి శాస్త్రీగారి పాట‌ల‌పై మెగాస్టార్ ఎలాంటి పీడ్ బ్యాక్ ఇస్తారో చూడాలి. ఈ చిత్రాన్ని కొణిదెల ప్రొడ‌క్ష‌న్ కంపెనీ-సూప‌ర్ గుడ్ ఫిల్మ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.