Begin typing your search above and press return to search.
శాటిలైట్ - డిజిటల్ లో ఆ మూడు బిగ్ డీల్స్
By: Tupaki Desk | 4 Sep 2019 6:05 AM GMT`సాహో` తర్వాత టాలీవుడ్ లో టాప్ 3 సినిమాలేవి? ఆ సినిమాల డిజిటల్ రైట్స్ - శాటిలైట్ బిజినెస్ సంగతేమిటి? అంటే వివరాల్లోకి వెళ్లాల్సిందే. రామ్ చరణ్ - ఎన్టీఆర్ కథానాయకులుగా దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి తెరకెక్కిస్తున్న `ఆర్.ఆర్.ఆర్`.. మహేష్ - అనీల్ రావిపూడి కాంబనేషన్ లో రూపొందుతున్న`సరిలేరు నీకెవ్వరు`.. అల్లు అర్జున్ - త్రివిక్రమ్ కాంబినేషన్ లో రూపొందుతున్న `అల వైకుంటపురంలో` చిత్రాలు టాప్ 3 సినిమాలుగా రికార్డులకెక్కాయి.
2019-20 మోస్ట్ అవైటెడ్ మూవీ `ఆర్.ఆర్.ఆర్` శాటిలైట్ - డిజిటల్ రైట్స్ అన్ని భాషలకు 160కోట్ల ఆఫర్ వచ్చిందని ఇదివరకూ ఫిలింనగర్ లో చర్చ సాగింది. నిర్మాతలు 250 కోట్ల మేర డిమాండ్ చేస్తున్నారని డీల్ ఇంకా క్లోజ్ కాలేదని తెలిసింది. రజనీకాంత్- అక్షయ్ కుమార్- శంకర్ కాంబినేషన్ మూవీ 2.0కు అన్ని భాషల డిజిటల్ - శాటిలైట్ రైట్స్ ని 170 కోట్లకు అమ్మారు. ఆర్.ఆర్.ఆర్ నిర్మాత దానయ్య అంతకుమించి ఆశిస్తున్నారని ప్రచారమైంది.
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ - త్రివిక్రమ్ కాంబినేషన్ హ్యాట్రిక్ మూవీ `అల వైకుంటపురంలో` డిజిటల్ రైట్స్ రేంజ్ 12-15కోట్ల మేర ఉందని తెలుస్తోంది. సన్ నెక్ట్స్ వాళ్లు ఈ సినిమా డిజిటల్ రైట్స్ చేజిక్కించుకున్నారు. జెమిని టీవీ ఈ సినిమా శాటిలైట్ హక్కుల్ని దక్కించుకోనుందని తెలుస్తోంది. మరోవైపు సూపర్ స్టార్ మహేష్ - అనీల్ రావిపూడి కాంబినేషన్ మూవీ `సరిలేరు నీకెవ్వరు` చిత్రానికి 16.5 కోట్ల మేర శాటిలైట్ రైట్స్ కి జెమిని నెట్ వర్క్ కి విక్రయించారని తెలుస్తోంది. నిర్మాతలకు సంబంధం లేకుండా మహేష్ - నమ్రత ఖాతాలోకి శాటిలైట్ డీల్ వెళుతోందన్న ప్రచారం ఉంది. కార్పొరెట్ దిగ్గజాలతో నమ్రతనే స్వయంగా ఈ డీల్స్ మాట్లాడుతున్నారని ఇదివరకూ కథనాలు వెలువడ్డాయి.