Begin typing your search above and press return to search.

స్టేట్ డివైడ్ డేస్.. శాటిలైట్ క్రైసిస్ గుర్తుందా?

By:  Tupaki Desk   |   4 Sep 2019 2:30 PM GMT
స్టేట్ డివైడ్ డేస్.. శాటిలైట్ క్రైసిస్ గుర్తుందా?
X
ఏపీ- తెలంగాణ డివైడ్ ఫ్యాక్ట‌ర్ టాలీవుడ్ ని అత‌లాకుత‌లం చేసిన సంగ‌తిని ప‌రిశ్ర‌మ ప్ర‌ముఖులెవ‌రూ అంత తేలిగ్గా మ‌ర్చిపోలేరు. ఆ బ్యాడ్ ఫేజ్ లో తెలుగు సినిమాకి శాటిలైట్ దారుణంగా ప‌డిపోయింది. ఒక ర‌కంగా జీరో అయిపోయింది. మ‌న సినిమాల్లో స‌రైన క‌థ‌లు లేక క్రియేవిటీ అస‌లే లేక దారుణ‌మైన స్లంపు క‌నిపించింది అప్ప‌ట్లో. సెకండ్ గ్రేడ్ హీరోల సినిమాల వైపు చూడ‌టం మానేశారు ఆ సీజ‌న్ లో. చ‌వ‌క‌బారు కంటెంట్ పై మొహం మొత్తిన ఆడియెన్ టీవీలు చూడ‌టం కూడా మానేయ‌డంతో ఎంట‌ర్ టైన్ మెంట్ చానెళ్ల‌కు సినిమాలు కొనాల‌నే ఆలోచ‌నే పోయింది.

అయితే ఆ స‌న్నివేశం నుంచి ఇటీవ‌లే టాలీవుడ్ బ‌య‌ట‌ప‌డింది. ప్ర‌స్తుతం కొత్త పంథా క‌థ‌ల‌తో సినిమాలొస్తున్నాయి. పైగా కంటెంట్ ని మ‌న ద‌ర్శ‌కులు కొత్త‌గా ప్రెజెంట్ చేస్తున్నారు. ఈ ప‌రిణామంతో శాటిలైట్ బిజినెస్ లోనూ ఉత్సాహం పెరిగింది. శాటిలైట్ రైట్స్ మ‌న నిర్మాత‌ల‌కు పెద్ద భరోసాగా నిలుస్తున్నాయి. 2019 లో శాటిలైట్ బిజినెస్ ఆశాజ‌న‌కంగా ఉంది. సినిమా రేంజును బ‌ట్టి భారీగానే ఆర్జిస్తున్నారు. అయితే అనూహ్యంగా ఇంత‌లోనే మ‌రో ఊహించ‌ని ప‌రిణామం పంటికింద రాయిలా త‌గులుతోంద‌ని స‌మాచారం అందింది.

ప్ర‌స్తుతం టాలీవుడ్ లో ఓ మూడు ఎంట‌ర్ టైన్ మెంట్ చానెళ్ల మ‌ధ్య ర‌క‌ర‌కాల విష‌యాల్లో తీవ్ర‌మైన పోటీ ఉన్న సంగ‌తి తెలిసిందే. సినిమాల శాటిలైట్ కి ఈ మూడు చానెళ్లు బోలెడంత భరోసానిస్తున్నాయి. క్రేజును బ‌ట్టి సినిమాల్ని కొనేందుకు ఈ చానెళ్లు పోటీప‌డుతున్నాయి. అయితే ఊహించ‌ని విధంగా వాటిలో ఓ చానెల్ కి వాణిజ్య ప్ర‌క‌ట‌న‌ల ఆదాయం (యాడ్స్) త‌గ్గ‌డంతో ఒక‌టికి ప‌దిసార్లు ఆలోచించే ప‌రిస్థితి నెల‌కొంద‌ని చెబుతున్నారు. దాంతో భారీగా పెట్టుబ‌డులు వెద‌జ‌ల్లి శాటిలైట్ రైట్స్ కొనేందుకు స‌ద‌రు చానెల్ ఆస‌క్తిని క‌న‌బ‌ర‌చ‌డం లేద‌ట‌. దీంతో మిగిలిన రెండు చానెళ్లు ఎంత‌కు కొంటే అంత‌కు మాత్ర‌మే నిర్మాత‌లు శాటిలైట్ రైట్స్ ని క‌ట్ట‌బెట్టాల్సి వ‌స్తోంద‌ని చెప్పుకుంటున్నారు. కొనేవాళ్ల మ‌ధ్య‌ పోటీ త‌గ్గితే ఆ మేర‌కు నిర్మాత‌ల‌కు శాటిలైట్ ఆదాయం ప‌డిపోతుందన్న‌ది కాద‌నలేని నిజం. భారీ క్రేజుతో వ‌చ్చే పెద్ద సినిమాల వ‌ర‌కూ ఆ ప్ర‌భావం ఉండ‌దేమో కానీ.. ద్వితీయ శ్రేణి సినిమాల‌కు మాత్రం ముప్పు పొంచి ఉండ‌నుంది. తెలుగు సినిమాకి ద‌న్నుగా నిలిచే మూడు నాలుగు చానెళ్ల‌లో రెండు పోటీలో లేన‌ట్టే అనుకుంటే కేవ‌లం రెండే చానెళ్ల మ‌ధ్య పోటీ న‌డిచినా ఆ మేర‌కు మోనోప‌లి ద్వారా పంచ్ ప‌డే ఆస్కారం ఉంద‌ని విశ్లేషిస్తున్నారు.