Begin typing your search above and press return to search.

శాటిలైట్ 'పునీత్‌'.. ఇదో అద్బుతం

By:  Tupaki Desk   |   1 March 2022 11:30 PM GMT
శాటిలైట్ పునీత్‌.. ఇదో అద్బుతం
X
కన్నడ సూపర్ స్టార్ పునీత్‌ రాజ్‌ కుమార్‌ మృతి నుండి అభిమానులు నెలలు గడుస్తున్నా కూడా తేరుకోలేక పోతున్నారు. ఆయన చేసిన సినిమాల ద్వారానే కాకుండా సేవా కార్యక్రమాల ద్వారా కూడా హీరో అయ్యాడు. అందుకే ఆయన మృతి చెందిన సమయంలో దేశ వ్యాప్తంగా ఆయన గురించి మాట్లాడుకోవడం జరిగింది. కన్నడ ముఖ్యమంత్రి స్వయంగా అంత్య క్రియలకు హాజరు అయ్యి దగ్గర ఉండి అన్ని కార్యక్రమాలు చూసుకున్నారు.

కర్ణాటక ప్రభుత్వం పునీత్‌ రాజ్‌ కుమార్‌ కు మృతి చెందిన తర్వాత అత్యున్నత పురష్కారంను ఇచ్చారు. పునీత్‌ చనిపోయిన ఇన్ని నెలల తర్వాత ఆయన చివరి సినిమా జేమ్స్ విడుదలకు సిద్దం అయ్యింది. ఈనెలలో ఆయన మొదటి జయంతి సందర్బంగా జేమ్స్ ను భారీ ఎత్తున విడుదల చేసేందుకు గాను ఏర్పాట్లు చేస్తున్నట్లుగా ప్రకటించారు. ఇదే సమయంలో పునీత్‌ రాజ్ కుమార్ పేరుతో ఒక శాటిలైట్‌ ను కూడా తయారు చేస్తున్నట్లుగా ప్రకటించారు.

పునీత్‌ రాజ్‌ కుమార్‌ జ్ఞాపకార్థంగా ఐటీబీటీ శాఖ తరపున ఒక శాటిలైట్ ను తయారు చేస్తున్నట్లుగా మంత్రి అశ్వత్థనారాయణ ప్రకటించాడు. ఇది పూర్తిగా కర్ణాటక విద్యార్థలు మరియు మేధావులు మాత్రమే తయారు చేస్తున్నట్లుగా ఆయన పేర్కొన్నారు. ఈ ప్రయోగంలో 20 పాఠశాలకు చెందిన వారు పాల్గొనబోతున్నారు. రాష్ట్ర చరిత్రలో ఇదో ఒక గొప్ప విజయంగా నిలువబోతున్నట్లుగా మంత్రి పేర్కొన్నారు.

ఐటీబీటీ శాఖ నుండి ఈ ప్రయోగం కోసం దాదాపుగా రెండు కోట్ల రూపాయలను విడుదల చేయబోతున్నట్లుగా ప్రకటించారు. సాదారణంగా అయితే ఒక శాటిలైట్‌ ను తయారు చేసేందుకు గాను కనీసం 50 లక్షల రూపాయలు ఖర్చు అవుతాయని అంటారు. కాని కన్నడ విద్యార్థులు కేవలం కేజీ బరువున్న శాటిలైట్‌ ను తక్కువ ఖర్చు తో తయారు చేస్తున్నట్లుగా చెబుతున్నారు.

50 కేజీల బరువు ఉండే శాటిలైట్ ఎక్కువ ఖర్చు అవుతుంది. కాని కేవలం కేజీ బరువు మాత్రమే ఉండే శాటిలైట్‌ అవ్వడం వల్ల రెండు కోట్ల రూపాయలతోనే పూర్తి చేస్తున్నట్లుగా చెబుతున్నారు. ఈ శాటిలైట్‌ కు సంబంధించిన విషయాలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. పునీత్‌ శాటిలైట్‌ అంటూ ఈ ఏడాదిలోనే నింగిలోకి ఈ శాటిలైట్ ఎగరబోతున్నట్లుగా మంత్రి ప్రకటించాడు. ఇది ప్రతి ఒక్క కన్నడ సినీ మరియు సాదారణ జనాలకు గర్వకారణం.