Begin typing your search above and press return to search.
కట్టప్ప చెప్పింది కూడా పాయింటే
By: Tupaki Desk | 19 Feb 2018 9:07 AM GMTతమిళనాట ఏకకాలంలో రాజకీయ రంగప్రవేశం చేస్తున్న రజనికాంత్, కమలహాసన్ లకు మద్దతు, వ్యతిరేకత సమాన స్థాయిలో వస్తున్నాయి. సినిమా పరిశ్రమ నుంచి బేషరుతుగా తాము వెంటే ఉంటామని కొందరు చెబుతుండగా కొందరు మాత్రం రిటైర్ అయ్యే వయసులో రాష్ట్రంలో సమస్యలు గుర్తుకు వచ్చాయా అంటూ విరుచుకుపడుతున్నారు. ఈ రెండో బ్యాచ్ లో బాహుబలి కట్టప్ప కూడా జాయిన్ అయ్యాడు. మూడు దశాబ్దాలు సినిమాల్లో తిరుగులేని స్టార్ డం ఎంజాయ్ చేసాం కాబట్టి అది పాలిటిక్స్ లో కూడా చెల్లుతుంది అనుకుంటే అది భ్రమే అన్న సత్యరాజ్ అసలు అవగాహన లేకుండా ఎందుకు వస్తున్నారో అర్థం కావడం లేదని చురక వేసాడు. కోట్లాది రూపాయల సంపద, డబ్బు సినిమాల్లో వచ్చేసింది కాబట్టి ఒకవేళ రాజకీయాల్లో దెబ్బ తిన్నా నష్టం ఉండదు అనుకుంటే అంత కన్నా తెలివితక్కువ పని మరొకటి ఉండదని తేల్చి చెప్పేసాడు.
సత్యరాజ్ చెప్పిన మాటల్లో లాజిక్ ఉంది. ఎన్టీఆర్, ఎమ్జీఆర్ తర్వాత రాజకీయాలను ఆ స్థాయిలో ప్రభావితం చేసిన సినిమా హీరో మరొకరు లేరు.హీరొయిన్స్ లో జయలలిత ఒక్కరే అంత వైభవం చూసారు. వారి తర్వాత ఇంకో పేరు చెప్పడానికి ఛాన్స్ లేదు. రజనికాంత్ తర్వాత అంతటి స్టార్ స్టేటస్ ఎంజాయ్ చేసిన విజయ్ కాంత్ రాజకీయాల్లో దారుణంగా దెబ్బ తిన్నాడు. ఇప్పటికీ కోలుకోలేదు. అందుకే సత్యరాజ్ వీటిని దృష్టిలో పెట్టుకునే ఈ కామెంట్స్ చేసినట్టు అనుకోవచ్చు.
రజని, కమల్ లకు సమకాలికుడు అయిన సత్యరాజ్ తమిళ్ సినిమాలో తనకంటూ ప్రత్యేక ముద్ర ఉండేలా చూసుకున్నాడు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారాక కూడా డిమాండ్ ఏ మాత్రం తగ్గని సత్యరాజ్ కెరీర్ లో చాలా తక్కువ సినిమాలలో రజని, కమల్ తో కలిసి నటించాడు. సత్య రాజ్ చేసిన కామెంట్స్ ఇప్పుడు చర్చగా మారాయి. శరత్ కుమార్, భారతి రాజా లాంటి సీనియర్ల తర్వాత కొంత ఘాటుగా ఆ ఇద్దరి గురించి స్పందించింది సత్య రాజే.