Begin typing your search above and press return to search.

భల్లాల భార్యపై కామెడీ చూడండి

By:  Tupaki Desk   |   1 May 2017 7:28 AM GMT
భల్లాల భార్యపై కామెడీ చూడండి
X
కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు అనే ప్రశ్న ఏడాదిన్నరకు పైగా ‘బాహుబలి’ ప్రియుల్ని వేధించింది. ఎట్టకేలకు ఆ ప్రశ్నకు సమాధానం దొరికేసింది. ఐతే సినిమా చూశాక జనాలు దాని గురించి పెద్దగా డిస్కస్ చేయట్లేదు. వాళ్లనిప్పుడు కొత్త ప్రశ్న వేధిస్తోంది. అదే.. భల్లాలదేవుడి భార్య ఎవరు అని. కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడనే ప్రశ్నకు #wkkb అనే హ్యాష్ ట్యాగ్ పెట్టి చర్చ నడుపుతూ వచ్చిన జనాలు.. ఇప్పుడు భల్లాలదేవుడి భార్య ఎవరు అనే ప్రశ్నకు తగ్గట్లు #wwb అనే హ్యాష్ ట్యాగ్ తో రచ్చ చేస్తున్నారు. దీని మీద సోషల్ మీడియాలో బోలెడన్ని జోకులు పేలుతున్నాయి.

భల్లాలదేవుడి తల్లి శివగామి.. తండ్రి బిజ్జాలదేవుడు.. అతడి క్రష్ దేవసేన.. అతడి కుక్క కట్టప్ప.. అంటూ ఒక్కొక్కక్కరిని చూపించి.. చివరికి అతడి ఆయుధం గద అని చూపిస్తూ చివరికి వచ్చేసరికి అతడి భార్య అనగానే ఎర్రర్ చూపిస్తున్నట్లుగా జోక్ ఒకటి తయారు చేశారిప్పుడు. అది ఆన్ లైన్లో హల్ చల్ చేస్తోంది. కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడనే ప్రశ్నకు ఏదో ఒక రోజు సమాధానం లభిస్తుందిలే అని ఆశతో ఉన్న జనాలు.. భల్లాలదేవుడి భార్య ఎవరు అనే ప్రశ్నకు మాత్రం ఎప్పుడూ జవాబు చిక్కదని ఆవేదన చెందుతున్నారు. సినిమా విషయంలో అంత జాగ్రత్తలు తీసుకున్న రాజమౌళి.. కనీసం ఒక్క సీన్లో అయినా భల్లాలదేవుడి భార్య అంటూ ఎవరినో ఒకరిని చూపించేస్తే బాగుండేదని అభిప్రాయపడుతున్నారు జనాలు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/