Begin typing your search above and press return to search.

సంఘమిత్రగా ఆమె.. తిట్టిపోస్తున్నారు

By:  Tupaki Desk   |   22 Oct 2017 7:34 AM GMT
సంఘమిత్రగా ఆమె.. తిట్టిపోస్తున్నారు
X
అసలు ‘సంఘమిత్ర’ సినిమా ఎప్పుడు మొదలవుతుందో ఏమో కానీ.. ఏడాది నుంచి దీనికి సంబంధించిన అప్ డేట్స్ తోనే పుణ్య కాలం గడిచిపోతోంది. శ్రుతి హాసన్ ఈ సినిమా నుంచి తప్పుకున్నాక ఈ సినిమా మీద జనాలకు అప్పటిదాకా ఉన్న ఆసక్తి తగ్గిపోయింది. దీనికి తోడు శ్రుతి స్థానంలో మరో కథానాయికను ఎంచుకోవడంలో బాగా ఆలస్యం కావడంతో నెగెటివిటీ మరింత పెరిగిపోయింది. ఓ దశలో ఈ సినిమా ఆగిపోయిందన్న వార్తలు కూడా వచ్చాయి. దర్శకుడు సుందర్ అధికారికంగానే ఈ సినిమాను హోల్డ్‌లో పెట్టి ‘కలగలప్పు-2’ సినిమా పూర్తి చేశాడు. ఐతే ఆ సినిమా చకచకా అయిపోవడంతో మళ్లీ ‘సంఘమిత్ర’పై దృష్టిపెట్టినట్లున్నాడు సుందర్.

తాజా కబురేంటంటే ఈ చిత్రంలో కథానాయికగా బాలీవుడ్ హీరోయిన్ దిశా పటానిని కన్ఫమ్ చేశారు. సుందర్ భార్య ఖుష్బు ఈ విషయాన్ని ట్విట్టర్లో అధికారికంగా ప్రకటించింది. దిశా పటాని కూడా తాను ‘సంఘమిత్ర’లో నటించబోతుండటం వాస్తవమే అని తెలిపింది. తనకు మార్షల్ ఆర్ట్స్ లో ఉన్న అనుభవం ఈ సినిమాకు పనికొస్తుందని ఆమె అంది. ఐతే ‘సంఘమిత్ర’ సినిమాకు దిశా కన్ఫమ్ అయిన సంగతి బయటికి రాగానే సోషల్ మీడియాలో తమిళ ప్రేక్షకుల నుంచి సెటైర్ల మీద సెటైర్లు పడ్డాయి. చాలా మోడర్న్‌గా కనిపించే దిశా.. సంఘమిత్ర పాత్రకు ఏమాత్రం సూటవుతుందన్న సందేహాలు వ్యక్తమయ్యాయి. ఇంకెవరూ దొరకలేదా అంటూ కామెంట్లు చేశారు నెటిజన్లు. దిశా లుక్ చూస్తే ఆమె ఇలాంటి సినిమాకు సూట్ కాదేమో అన్న సందేహాలు బలంగానే వినిపిస్తున్నాయి.