Begin typing your search above and press return to search.
‘గరుడవేగ’కు ‘బాహుబలి’ కనెక్షన్
By: Tupaki Desk | 6 Nov 2017 6:41 AM GMTబాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడు అనే ప్రశ్నతో దాదాపు 20 నెలల పాటు వెర్రెత్తిపోయారు ప్రేక్షకులు. ఐతే ఎట్టకేలకు ఈ ఏడాది ఏప్రిల్ 28న ఆ ప్రశ్నకు జవాబు దొరికింది. ఐతే ఈ సినిమా విడుదలయ్యాక ప్రేక్షకులకు కొత్త సందేహం పుట్టింది. ‘బాహుబలి’ రెండు భాగాల్లోనూ భల్లాల దేవుడి భార్య ఎవరన్నది చూపించకపోవడంతో.. దీని మీద సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున జోకులు పేలాయి. ఇప్పుడు ‘గరుడవేగ’ సినిమాకు సంబంధించి ఇలాంటి ప్రశ్నే ప్రేక్షకుల మెదళ్లను తొలిచేస్తోంది. ‘బాహుబలి’ ప్రశ్నలతో పోలుస్తూ దీని మీద కూడా సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చ నడుస్తుండటం విశేషం.
‘గరుడవేగ’లో హీరోకు క్యాన్సర్ ఉందా లేదా అన్నదే ఇప్పుడు ప్రేక్షకుల్ని తొలిచేస్తున్న ప్రశ్న. ఇందులో డాక్టర్ పాత్రలో పృథ్వీ కనిపించి హీరోకు సంబంధించిన రిపోర్ట్ చూసి క్యాన్సర్ ఉందో లేదో సరిగా చెప్పకుండా తన గోడేదో చెబుతుంటాడు. ఆ రిపోర్ట్ చూసిన హీరో పై అధికారి క్యాన్సర్ అంటాడు. దీని మీద అక్కడక్కడా కొంచెం కామెడీ నడుస్తుంది. ప్రి క్లైమాక్సులో సినిమా సీరియస్ గా నడుస్తున్నపుడు కూడా ఈ తమషా కొనసాగుతుంది. ఐతే నిజంగా హీరోకు క్యాన్సర్ ఉందా లేదా అన్నది మాత్రం స్పష్టత ఇవ్వరు. మరి హీరోకు క్యాన్సర్ అనే అంశాన్ని కేవలం కామెడీ కోసం అలా వాడుకున్నారా.. లేక నిజంగా అతడికి క్యాన్సర్ ఉందా అన్నది స్పష్టత ఇవ్వలేదు. ఈ విషయాన్ని ట్విట్టర్లో ఓ వ్యక్తి ప్రస్తావిస్తే.. హీరోకు క్యాన్సర్ ఉందా లేదా అన్నది తనకు కూడా తెలియదని.. ప్రవీణ్ సత్తారునే అడగాలని రాజశేఖర్ అనడం విశేషం.