Begin typing your search above and press return to search.

బాలయ్యనే మించి పోయాడే

By:  Tupaki Desk   |   12 Jan 2019 5:30 PM GMT
బాలయ్యనే మించి పోయాడే
X
నందమూరి బాలకృష్ణ కొన్ని సినిమాల్లో చేసిన యాక్షన్‌ సీన్స్‌ ఆమద్య సోషల్‌ మీడియాలో తెగ మీమ్స్‌ అయిన విషయం తెల్సిందే. తొడ కొట్టి రైలును ఆపడం - కోడికి కత్తి కట్టి విలన్‌ ను చంపడం వంటివి ఆమద్య బాలకృష్ణ చేసి నవ్వులపాలయ్యాడు. అయితే ఈమద్య కాలంలో బాలకృష్ణ కాస్త ఆ రేంజ్‌ యాక్షన్‌ ను వదిలేశాడు. బాలకృష్ణ స్థానంలో చరణ్‌ ను ఉంచాలనుకున్నాడో ఏమో కాని బోయపాటి 'వినయ విధేయ రామ' చిత్రంలో యాక్షన్‌ సీన్స్‌ ను పీక్స్‌ లో దించాడు.

మెగా మూవీలో మరీ యాక్షన్‌ ఎక్కువ ఉంటే బాగుండదని ఫ్యాన్స్‌ అనుకుంటూనే ఉన్నారు. బోయపాటికి ముందే చిరంజీవి మరీ యాక్షన్‌ వద్దు, కాస్త తగ్గించు అంటూ సూచించాడని కూడా వార్తలు వచ్చాయి. ఎవరేం అనుకున్నా, ఎలా అయినా చరణ్‌ తో బోయపాటి చేయించిన యాక్షన్‌ సీక్వెన్స్‌ మరీ కామెడీగా సోషల్‌ మీడియాలో ట్రెండ్‌ అవుతున్నాయి. బాలయ్య సినిమాల్లో గతంలో కనిపించిన కామెడీ యాక్షన్‌ సీన్స్‌ ఇప్పుడు చరణ్‌ మూవీలో చూస్తున్నాం అంటూ కొందరు సోషల్‌ మీడియాలో కామెంట్స్‌ చేస్తున్నారు.

సినిమాలోని తలలు నరికేసే సీన్‌ మరీ ఓవర్‌ అయ్యింది. మరీ అంత ఓవర్‌ సీన్స్‌ ను ప్రేక్షకులు అస్సలు ఒప్పుకోరు. హీరో ఎంత ఎమోషనల్‌ గా ఉన్నా ఫైట్స్‌ రియలిస్టిక్‌ గా ఉండాలనే ఇప్పుడు ప్రేక్షకులు కోరుకుంటున్నారు. ఆ విషయాన్ని దర్శకుడు బోయపాటి పట్టించుకోకుండా బంతుల్లా తలలను గాల్లో ఎగిరేలా చేసి చరణ్‌ పరువు తీశాడు. రంగస్థలం వంటి మంచి సినిమాను చేసిన చరణ్‌, తర్వాత సినిమా ఇంకా ఎంత మంచి సినిమాను చేస్తాడో అంటూ అంతా ఎదురు చూశారు. కాని చరణ్‌ మరీ ఇలాంటి కథకు ఎలా ఓకే చెప్పాడో ఆయనకే తెలియాలి.