Begin typing your search above and press return to search.
సంపూపై రివర్సు సెటైర్లు పడుతున్నాయి
By: Tupaki Desk | 27 July 2016 5:30 PM GMTఎవరో పంపించారు.. సరదాకి తీసుకోండి.. అంటూ.. ''ఈ నగరానికి ఏమైంది..'' అనే యాడ్ లోని వాయిస్ ను ఇమిటేట్ చేస్తూ.. ''ఓ పక్క సర్దార్.. మరో ప్రక్క బ్రహ్మోత్సవం.. పైగా కబాలి కూడా నోరు మెదపట్లేదు. ఈ నిర్లక్ష్య దోరణికి కొబ్బరిమట్టి పాడాలి చరమగీతం'' అంటూ ఎవరో పంపిన ఒక పోస్టును షేర్ చేశాడు సంపూపర్ణేష్ బాబు. పవన్ అండ్ మహేష్ వంటి ఇద్దరి పెద్ద హీరోలపై ఇలా పంచు వేస్తే మరి సెటైర్లు పడకుండా ఉంటాయి. పడ్డాయి.
అదిగో చూస్తున్నారుగా ఆ ఫోటోలో.. మన్మథుడు సినిమాలో తనికెళ్ళ మరియు సుధ మధ్య జరిగే దేవుడు డైలాగ్ తీసుకుని.. ''మహేష్ బాబు ఉన్నాడని సంతోషించే లోపే సంపూర్ణేష్ బాబు ఉన్నాడని గుర్తు చేస్తుంటాడు దేవుడు'' అంటూ పంచేశారు సినిమా లవర్స్. ఇది కూడా సరదాకే అంటున్నారు వారు. అయితే సంపూ ఏమీ వీటిని సీరియస్ గా తీసుకుని ఫీలయ్యే రకం కాదులే. పైగా ఇలాంటి సెటైర్లను స్వయంగా తనే అందరితో షేర్ చేసుకుంటున్నాడు. అంటే.. బాలీవుడ్ హీరో షారూఖ్ ఖాన్ తరహాలో.. మీరు నన్ను తిట్టినా పొగిడినా కూడా అది నాకే పబ్లిసిటీ అన్నట్లు వ్యవహరిస్తున్నాడనమాట.
మొత్తానికి ట్రాలింగ్.. అండ్ రివర్స్ ట్రాలింగ్ అనే కాన్సెప్టును.. ఇప్పుడు సక్సెస్ ఫుల్ గా అజిత్ అండ్ విజయ్ ఫ్యాన్స్ దగ్గర నుండి మన టాలీవుడ్ అభిమానులు కూడా బాగానే వంత పట్టించుకున్నారు. ఎవరు సోషల్ నెట్వర్కులో ఏమన్నా కూడా.. మనోళ్ళు కౌంటర్లుతో తుప్పు లేపేస్తున్నారు.