Begin typing your search above and press return to search.
స్టేట్మెంట్లు ఇవ్వటానికి ముందుండే హీరో..మరి సాయం చేయటానికి రాడా?
By: Tupaki Desk | 4 April 2020 11:30 AM GMTకరోనా వైరస్ వల్ల ప్రపంచం గడగడలాడుతోంది. మన దేశంలోనూ కరోనా తన ఉగ్రరూపాన్ని చూపిస్తోంది. కరోనా వైరస్ కారణంగా దేశం ప్రస్తుతం క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటున్నది. ప్రపంచవ్యాప్తంగా లక్షల మందికి కరోనా సోకగా వేలమంది ప్రాణాలను కోల్పోయారు. రోజు రోజుకు కరోనా కేసులు కుప్పలు తెప్పులుగా పెరుగుతున్నాయి. మన తెలుగు రాష్ట్రాల్లో కూడా కరోనా కేసులు అధికమవుతుండగా.. మరణాల సంఖ్య కూడా పెరుగుతూ వస్తోంది. కరోనాను కట్టడి చేయడంలో భాగంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనేక చర్యలను చేపడుతున్నారు. కరోనా వ్యాప్తిని నివారించడానికి భారత ప్రభుత్వం లాక్ డౌన్ విధించింది. ఈ సమయంలో ప్రజలెవరూ రోడ్ల మీదుక రాకూడదని - ఇంటికి పరిమితం కావాలని ఆదేశించింది. దినసరి కూలీలు - శ్రామికులు - కార్మికులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. కరోనా వైరస్ పై పోరాటం చేసేందుకు మేముసైతం అంటూ సినీ తారలు ముందుకు వచ్చారు. టాలీవుడ్ నుండి కూడా అందరు హీరోలు తమకు తోచిన ఆర్థిక సాయాన్ని ప్రకటిస్తూ ప్రభుత్వాలకు అండగా నిలబడుతున్నారు.
ఇలాంటి కష్ట సమయాల్లో టాలీవుడ్ లోని యువ హీరోలు అందరూ తమ వంతు సహాయం చేశారు... కానీ విజయ్ దేవరకొండ మాత్రం సాయం చేయడానికి బయటకి రావడం లేదని సోషల్ మీడియాలో నెటిజన్లు విమర్శిస్తున్నారు. సినీ కార్మికులకు సహాయం చేయడం కోసం ఏర్పడిన 'సీసీసీ' కి కూడా విరాళం ప్రకటించకపోవడం విజయ్ అభిమానులకు నిరాశను కలిగిస్తున్నది. స్టేట్ మెంట్లు ఇవ్వడానికి ముందుకు వస్తాడు కానీ సాయం చేయడానికి మాత్రం రాడు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. నిజానికి ఇండస్ట్రీలో ఉన్న మీడియం రేంజ్ హీరోలు కూడా విరాళాలు ప్రకటించారు ఒక్క విజయ్ తప్ప. కానీ కొంతమంది ప్రైవేట్ గా హెల్ప్ చేసినా బయటకి చెప్పుకోరు. మరి దేవరకొండ కూడా వాళ్లలో ఒకడిగా ఉన్నాడేమో. అయినా ఇలాంటి టైమ్ లో గుప్త దానాలు పనికిరావు భయ్యా..ఏదైనా పబ్లిసిటీ చేస్తేనే మంచిది అని సోషల్ మీడియా వేదికగా సలహా ఇస్తున్నారట. వరుస ప్లాప్ లలో ఉన్న విజయ్ దగ్గర ప్రస్తుతం విరాళం ఇచ్చేంత మనీ లేవేమో అంటున్నారు నెటిజన్లు. వాస్తవానికి కరోనా వైరస్ పై అవగాహన కల్పించడానికి వీడియో రిలీజ్ చేసిన ఫస్ట్ హీరో విజయ్ దేవరకొండ. మరి ఇప్పుడు సైలెంటుగా ఉండటానికి కారణమేంటో ఆ పెరుమాళ్ళకే ఎరుక..!