Begin typing your search above and press return to search.

ఫేక్ ప్ర‌చారం వ‌ద్దు మొర్రో అన్నాడు

By:  Tupaki Desk   |   17 Jan 2020 8:12 AM GMT
ఫేక్ ప్ర‌చారం వ‌ద్దు మొర్రో అన్నాడు
X
సంక్రాంతి సినిమాల సంద‌డి గురించి తెలిసిందే. నాలుగు సినిమాలు ఒక‌దాని వెంట ఒక‌టిగా రిలీజై బాక్సాఫీస్ వ‌ద్ద కాసుల వేట సాగిస్తున్నాయి. ముఖ్యంగా అగ్రహీరోల సినిమాలు `స‌రిలేరు నీకెవ్వ‌రు`...`అల వైకుంఠ‌పుర‌ములో` థియేట‌ర్ లో రిలీజై విజ‌య‌వంతంగా ర‌న్ అవుతున్నాయి. ఆ రెండు రిలీజ్ ల‌ త‌ర్వాత రెండ్రోజుల గ్యాప్ తోనే (జ‌న‌వ‌రి 15న‌) నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్ న‌టించిన `ఎంత మంచివాడ‌వురా` కూడా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. స‌రిలేరు టీమ్ 103 కోట్లు గ్రాస్ వ‌సూలైంద‌ని ఓ పోస్ట‌ర్ ... అల వైకుంటపుర‌ములో 83 కోట్ల గ్రాస్ వ‌సూలు చేసిందంటూ వేరొక పోస్ట‌ర్ వేయ‌డంతో ఇవి ఫేక్ క‌లెక్ష‌న్స్ అంటూ ప్ర‌చార‌మైంది. రిలీజైన‌ రెండు...మూడు రోజుల‌కే వీళ్ల‌కు అంత సీన్ ఉందా? అన్న సందేహం వ్య‌క్తమైంది. ఒక‌రిపై ఒక‌రు ఆదిప‌త్యం కోసం ఫేక్ వార్ తెర‌పైకి తెచ్చార‌ని భావించారు.

తాజాగా `ఎంత మంచి వాడ‌వురా` క‌లెక్ష‌న్స్ పైనా అలాంటి ప్ర‌చారం ఒక‌టి తెర‌పైకి వ‌చ్చింది. ఎంత మంచివాడవురా 50 కోట్ల వ‌సూళ్లు తెచ్చింది అంటూ ఓ అభిమాని సోష‌ల్ మీడియాలో ప్ర‌చారం చేయ‌డం చ‌ర్చ‌కు వ‌చ్చింది. దీంతో ద‌ర్శ‌కుడు సంతీష్ వేగేశ్న‌ ఆ ప్ర‌చారాన్ని ఖండించారు. వాస్త‌వాల్ని దాచి త‌ప్పుడు ప్ర‌చారం చేయాల్సిన ప‌నే లేద‌ని ఫ్యాన్స్ ని వారించే ప్ర‌య‌త్నం చేశారు.

ద‌య చేసి ఇలాంటి రూమ‌ర్లు స్ప్రెడ్ చేయొద్ద‌ని..జెన్యూన్ రిపోర్టును...వాస్త‌వానికి ద‌గ్గ‌ర‌గా ఉండే ఫీడ్ బ్యాక్ ను మాత్ర‌మే ఇవ్వాల్సిందిగా అభిమానుల్ని ఆయ‌న‌ కోరారు. ఇక ఈ సినిమా థాంక్స్ మీట్ లో మూవీపై వ‌చ్చిన నెగిటివ్ ..పాజిటివ్ రివ్యూల గురించి క‌ళ్యాణ్ రామ్ స్పందన తెలిసిందే. విమ‌ర్శ‌ల‌ను కూడా క‌ళ్యాణ్ రామ్ ఎంతో పాజిటివ్ గా తీసుకుని త‌న హుందాత‌నాన్ని చాటుకున్నారు. గ‌తంలో తార‌క్- క‌ళ్యాణ్ రామ్ సైతం ఇలాంటి రివ్యూల్ని వ్య‌తిరేకిస్తూ నిజానికి ద‌గ్గ‌ర‌గా ఎంతో సానుకూలంగా స్పందించిన సంద‌ర్భాలున్నాయి. ఈ త‌ర‌హా ప్ర‌చారానికి కొణిదెల కాంపౌండ్ అధినేత రామ్ చ‌ర‌ణ్ సైతం ఎంతో వ్య‌తిరేకం అని ఇప్ప‌టికే ప్రూవైంది. సినిమాలో మ్యాట‌ర్ ఉంటే మౌత్ టాక్ ద్వారానే హిట్లు కొట్టే రోజులివి. ఆడియెన్ అప్ డేటెడ్ గా ఉన్నారు కాబ‌ట్టి ఫేక్ రిపోర్ట్స్ తో క‌లిసొచ్చేదేమీ లేద‌న్న‌ది అన‌లిస్టుల విశ్లేష‌ణ‌.