Begin typing your search above and press return to search.
రాజమౌళి కంటే ముందు అతడితో..
By: Tupaki Desk | 9 Jun 2018 7:40 AM GMTతెలుగు సినీ చరిత్రలో బాగా పేరుమోసిన పెద్ద బేనర్లలో దుర్గా ఆర్ట్స్ ఒకటి. ఈ బేనర్ మీద ‘హలో బ్రదర్’ సహా ఎన్నో భారీ సినిమాలు నిర్మించాడు కె.ఎల్.నారాయణ. ఐతే నిన్నటితరానికి చెందిన చాలామంది నిర్మాతల్లాగే ఇప్పటి ట్రెండును అందిపుచ్చుకోలేక నారాయణకూడా సినిమాలు తగ్గించేశారు. గత పదేళ్లుగా ఆయన్నుంచి సినిమాలే రాలేదు. అలాగని సినిమాలకు పూర్తిగా దూరం అయిపోలేదాయన. చాలా ఏళ్ల కిందటే దర్శక ధీరుడు రాజమౌళి నుంచి కమిట్మెంట్ తీసుకున్న నారాయణ.. అతడితో సినిమా చేసి మళ్లీ తన బేనర్ కు పూర్వ వైభవం తీసుకురావాలని ఆశిస్తున్నాడు. కానీ రాజమౌళితో సినిమా ఇప్పుడిప్పుడే ఓకే అయ్యేలా లేదు. నారాయణకు కచ్చితంగా సినిమా చేస్తానని రాజమౌళి పలు సందర్భాల్లో చెప్పాడు. ఆయన కంటే ముందు కమిట్మెంట్ ఇచ్చిన డీవీవీ దానయ్యకు సినిమా చేస్తున్నాడు జక్కన్న.
ఇది పూర్తయ్యాక నారాయణకే రాజమౌళి సినిమా చేసే అవకాశముంది. ఐతే చాలా ఏళ్లుగా ప్రొడక్షన్ కు దూరంగా ఉంటున్న నారాయణ.. రాజమౌళితో సినిమా కంటే ముందు ఓ చిన్న సినిమా తీసి టచ్ లోకి రావాలని డిసైడయ్యాడు. అందుకే ‘శతమానం భవతి’ దర్శకుడు సతీశ్ వేగేశ్న డైరెక్షన్లో ఓ సినిమాకు సన్నాహాలు చేస్తున్నాడు. ప్రస్తుతం దిల్ రాజు నిర్మాణంలో ‘శ్రీనివాస కళ్యాణం’ చేస్తున్న సతీశ్.. ఇదవ్వగానే దుర్గా ఆర్ట్స్ సినిమా మొదలుపెట్టనున్నాడు. ఓ యువ కథానాయకుడు ఈ చిత్రంలో హీరోగా నటిస్తాడట. తాను ఇంతకుముందే రెడీ చేసి పెట్టిన కథతో సతీశ్ ఈ సినిమా తీయబోతున్నాడట. ఈ చిత్రం వచ్చే ఏడాది విడుదలవుతుంది. ఆ తర్వాతి ఏడాది రాజమౌళితో సినిమా మొదలుపెట్టాలన్న యోచనలోఉన్నాడు నారాయణ.