Begin typing your search above and press return to search.
'శ్రీనివాస కళ్యాణం' షూటింగ్ లో ఆ రోజు..
By: Tupaki Desk | 12 Aug 2018 5:30 PM GMTస్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజుతో పని చేసే ప్రతి దర్శకుడూ చాలా సౌకర్యంగా ఉంటాడన్న అభిప్రాయాలు ఇండస్ట్రీలో ఉన్నాయి. స్క్రిప్టు దగ్గర్నుంచి అన్ని విషయాల్లోనూ రాజు ప్రమేయం ఉన్నప్పటికీ దర్శకుల్ని ఆయన బాగా గౌరవిస్తాడని అంటారు. రాజుతో పని చేసిన ప్రతి దర్శకుడూ ఆయన గురించి పాజిటివ్ గానే మాట్లాడతారు. ఐతే రాజుతో ‘శతమానం భవతి’ లాంటి బ్లాక్ బస్టర్ అందించిన సతీశ్ వేగేశ్నకు ఆయనతో ‘శ్రీనివాస కళ్యాణం’ షూటింగ్ సందర్భంగా చిన్న డిస్టర్బెన్స్ వచ్చిందట. సినిమాలో ఛండీగఢ్ నేపథ్యంలో సాగే సన్నివేశాల చిత్రీకరణ సందర్భంగా ఇద్దరికీ ఒక రోజు తేడా వచ్చిందట. ఛండీగఢ్ లో జరిగే డెస్టినేషన్ వెడ్డింగ్ కు సంబంధించి ఓ సన్నివేశం తీస్తుండగా.. రాజు వచ్చి సీన్ పేపర్లో డైలాగులపై అభ్యంతర పెట్టాడట.
పెళ్లి గొప్పదనం గురించి నితిన్ చెప్పే డైలాగుల్లో డోస్ ఎక్కువుందని.. ఇప్పుడే అలాంటి డైలాగులు చెప్పేస్తే క్లైమాక్స్ లో ఇంకేం చెబుతారని రాజు అన్నాడట. దీనికి నొచ్చుకున్న సతీశ్.. ఏం మాట్లాడకుండా సీరియస్ గా వెళ్లిపోయి సీన్ మార్చే పనిలో పడ్డాడట. ఐతే సతీశ్ తీరు చూస్తే అతను హర్టయ్యాడని అనిపించిందని.. ఏమైందని అడిగితే మాట్లాడలేదని.. కానీ తర్వాత ప్రొడక్షన్ వాళ్లను అడిగితే ఛండీగఢ్ షెడ్యూల్ అంతా సతీశ్ అదోలా ఉన్నాడని చెప్పారని రాజు వెల్లడించాడు. దీనిపై సతీష్ స్పందిస్తూ.. పెళ్లి సీన్లో తెలుగు వాళ్లు కాకుండా అందరూ పంజాబీ వాళ్లే ఉండటంపై తాను అప్పటికే అసహనంతో ఉన్నానని.. అలాంటి సమయంలో సీన్ మార్చమనేసరికి బాధ పడ్డానని చెప్పాడు. సెట్లో సీన్ మార్చమంటే ఎవరికైనా ఇబ్బందే అని సతీశ్ చెప్పాడు. ఐతే క్లైమాక్స్ లో పెళ్లి గురించి చెప్పడానికి డైలాగులు మిగలవని రాజు అలా చెప్పారని.. కానీ అక్కడ వేరే డైలాగులు పెట్టడం ఇబ్బందేమీ కాదన్నది తన అభిప్రాయమని చెప్పాడు.