Begin typing your search above and press return to search.
శతమానం.. మొత్తం క్రెడిట్ నిర్మాతదే
By: Tupaki Desk | 19 Dec 2016 9:30 AM GMTశతమానం భవతి ఆడియో రిలీజ్ ఫంక్షన్ హైద్రాబాద్ లో వైభవంగా జరిగింది. సినిమాలోని దాదాపు అందరు నటీ నటులు.. టెక్నీషియన్స్ ఈ కార్యక్రమానికి హాజరు కాగా.. అసలు ఈ మూవీ ప్రారంభం నుంచి.. పూర్తయ్యే వరకు జరిగిన ఇతివృత్తాన్ని దర్శకుడు సతీష్ వేగేశ్నవివరించాడు.
షూటింగ్ లో 150మంది క్రూ.. ఒక్కడినే మాట్లాడమంటే టెన్షన్ గా ఉంది అంటూ మొదలుపెట్టిన దర్శకుడు.. 'మాతృదేవో భవ.. పితృదేవోభవ అంటూ స్కూల్ లో చెప్పినపుడు దాని అర్ధం మనకు తెలీదు. అర్ధం తెలిసే ఏజ్ వచ్చేసరికి మన దగ్గర తల్లిదండ్రులో.. తల్లిదండ్రుల దగ్గర మనమో ఉండడం లేదు. అలాంటి ఆలోచనలోంచి వచ్చిన కథే శతమానం భవతి' అన్న దర్శకుడు ఓ అద్భుతమైన కవిత వినిపించి.. అందులోకి పుట్టిన కథే శతమానం భవతి అన్నాడు.
'మంచి కథ రాస్తే.. దాన్ని నమ్మి ఏడాదిన్నర పాటు దాన్ని నా కంటే ఎక్కువ ఓన్ చేసుకుని ఈ చిత్రాన్ని నిర్మించిన దిల్ రాజు గారికే ఈ శతమానం భవతి క్రెడిట్ దక్కుతుంది. టైటిల్ ను పెట్టినది కూడా దిల్ రాజు గారే. శతమానం భవతి టైటిల్ చాలా రోజుల నుంచి అనుకుంటున్నానన్న ఆయన.. ఈ టైటిల్ నీ కథకు సరిగ్గా సరిపోతుంది అన్నారు' అన్నాడు సతీష్ వేగేశ్న.
ఆ తర్వాత శర్వానంద్ ను కలిశాను.. కథ వింటాను.. నచ్చితేనే చేస్తాను.. లేకపోతే డిజప్పాయింట్ అవద్దు అన్నారు శర్వా. ఆ తర్వాతషూటింగ్ లో సీన్స్ ఇంప్రూవ్ చేసినపుడు.. ఎందుకు మారుస్తున్నారు అని అడిగినప్పుడు ఆశ్చర్యం వేసింది. అలాగే ప్రకాష్ రాజ్.. జయసుధగారికి రాస్తే చాలు అనుకున్నా.. కానీ వారితో చేసే అవకాశం చిక్కింది' అంటూ ప్రతీ ఒక్కరికీ పేరుపేరునా థ్యాంక్స్ చెప్పాడు దర్శకుడు సతీష్ వేగేశ్న.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/