Begin typing your search above and press return to search.
క్లైమాక్స్ 5 నిమిషాలు నితిన్ దేనన్న సతీష్!
By: Tupaki Desk | 23 July 2018 5:28 PM GMTబలహీనత..! బలహీనత లేని మనిషంటూ ఈ ప్రపంచం మీద ఉంటాడా? ఆ పాత కృతయుగంలో ఉండే అవకాశం ఉందేమోగానీ ఈ మోడరన్ జెనరేషన్ లో ఇట్ ఈజ్ హైలీ ఇంపాజిబుల్. మరి అందరికీ బలహీనతలున్నప్పుడు మనకు నష్టం లేని, కలిగించని బలహీనతను మనం హేళన చేయడం సంస్కారం అనిపించుకుంటుందా? కానీ జనాలు అందరూ XXX సోప్ వాడరు కదా. సో.. అందరి దగ్గరనుండి సంస్కారాన్ని ఆశించడం కూడా మన 'బలహీనతే'.
సరిగ్గా ఇలాంటి టాపిక్ మీదే 'శతమానం భవతి' సినిమాతో కుటుంబ ప్రేక్షకులను అయస్కాంతంలా ఆకర్షించి సినిమా హాళ్ళకు రప్పించిన సతీష్ వేగేశ్న 'శ్రీనివాస కళ్యాణం' ఆడియో వేడుకలో చెలరేగిపోయాడు. 'శ్రీనివాస కళ్యాణం' సినిమా హీరో నితిన్ స్పీడ్ గా మాట్లాడతాడు. అప్పుడప్పుడు తడబాటు ఉంటుంది కూడా. కానీ అది నితిన్ కెరీర్ కు ఏమాత్రం అడ్డంకి కాలేదు. తెలుగు ప్రేక్షకులు కూడా ఎప్పుడు దాన్ని ఒక బలహీనతలా భావించలేదు. వాళ్ళు నితిన్ ను ఎప్పుడు తమ హీరోలానే భావించారు.. ఎన్నో హిట్లు అందించారు కూడా. కానీ ఈ బలహీనతపై ఈమధ్యనే నితిన్ పేరు డైరెక్ట్ గా చెప్పకుండా మీడియా లో నెగెటివ్ ఆర్టికల్ కూడా వచ్చింది.
సతీష్ వేగేశ్న కు ఈ టాపిక్ పై మాట్లాడుతూ తను 'శ్రీనివాస కళ్యాణం' సినిమాను నితిన్ తో ప్లాన్ చేస్తున్నప్పుడు కొంతమంది నితిన్ ఈ సినిమాకు సూట్ అవుతాడో లేదో అని సందేహాలు వెలిబుచ్చారని అన్నాడు. ఈ సినిమాలో పెళ్లి.. మంత్రాలకు సంబంధించిన సీన్లలో డైలాగులను సరిగా పలకగలడో లేదో చెక్ చేసుకొని ప్రొసీడ్ అవ్వండి అంటూ తనకు చెప్పారని అన్నాడు. కానీ తను మాత్రం అవేమీ పట్టించుకోలేదన్నాడు.
ఈ సినిమాలో క్లైమాక్స్ లో ఐదు నిముషాల సీన్ ను నితిన్ ఒకే టేక్ లో చేసినప్పుడు మాత్రం యూనిట్ అంతా థ్రిల్లయ్యారని.. అందరూ లేచి నిలబడి మరీ చప్పట్లు కొట్టారని తెలిపాడు. అంతే కాదు ఈ సినిమాలో నితిన్ డైలాగులు చాలా బాగా చెప్పాడని తన హీరో పై ప్రశంసల వర్షం కురిపించాడు.