Begin typing your search above and press return to search.
అమలాపాల్ బాటలో 'బిచ్చగాడు' భామ
By: Tupaki Desk | 1 Dec 2018 10:17 AM GMTపెద్దల్ని ఒప్పించి పెళ్లిళ్లు చేసుకోవడం... ఆ తరువాత టర్మ్స్ కుదరకపోవడం, ఇద్దరి మధ్య ఈగో తారాస్థాయికి చేరడంతో విడిపోవడం ఇప్పుడు ట్రెండ్‌గా మారింది. సినిమా నాయికల్లో ఈ తంతు మరీ ఎక్కువైంది. దర్శకుడు ఎ.ఎల్.విజయ్‌తో ప్రేమలో పడిన అమలాపాల్ పెళ్లయి ఏడాది తిరక్కుండానే విడాకులు తీసుకుని ఒంటరి జీవితాన్ని సాగిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఇదే బాటలో `బిచ్చగాడు` భామ సాట్నా టైటస్ కూడా నడవడానికి సిద్ధమవుతున్నట్లు తెలిసింది.
`బిచ్చగాడు` సినిమాతో తెలుగు - తమిళ భాషల్లో మంచి గుర్తింపును సొంతం చేసుకున్న సాట్నా టైటస్ తమిళ డిస్ట్రిబ్యూటర్ కార్తిని ప్రేమించి పెద్దలను ఎదిరించి పెళ్లిచేసుకుంది. పెళ్లి సమయంలో వీరిపై ఇరు కుటుంబాలకు సంబంధించి అప్పట్లో పలు కేసులు కూడా నమోదయ్యాయి. అవి అప్పట్లో కోలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారాయి కూడా. అయితే ఇలా అన్నింటిని తట్టుకుని ప్రేమ వివాహం చేసుకున్నఈ జంట గత కొంత కాలంగా ఎడమొహం పెడమొహంగా వుంటున్నారట. వీరిద్దరి మధ్య మొదలైన గొడవలు విడాకులకు దారి తీశాయని తమిళ మీడియాలో కథనాలు వస్తున్నాయి. పట్టుమని రెండేళ్లు కూడా కాపురం వెలగబెట్టలేకపోయిన ఈ జంట మళ్లీ కలవడం కష్టమే అంటున్నారు.