Begin typing your search above and press return to search.

కృష్ణ‌మ్మ టీజ‌ర్ టాక్‌: పుట్టిన ప్ర‌తీఓడికీ ఏదో క‌థ వుండే వుంట‌ది!

By:  Tupaki Desk   |   4 Aug 2022 6:57 AM GMT
కృష్ణ‌మ్మ టీజ‌ర్ టాక్‌: పుట్టిన ప్ర‌తీఓడికీ ఏదో క‌థ వుండే వుంట‌ది!
X
టాలీవుడ్ లో వున్న యంగ్ హీరోల్లో స‌త్య‌దేవ్ భిన్నంగా అడుగులు వేస్తున్నారు. విభిన్న‌మైన క‌థ‌ల్ని ఎందుచుకుంటూ హీరోగా త‌న‌ ప్ర‌త్యేక‌త‌ని చాటుకుంటున్నారు. కొత్త త‌ర‌హా సినిమాల‌తో ఎప్ప‌టిక‌ప్పుడు ప్రేక్ష‌కుల్ని ప‌ల‌క‌రిస్తున్నారు. స‌త్య‌దేవ్ న‌టిస్తున్న స‌రికొత్త జాన‌ర్ మూవీ `కృష్ణ‌మ్మ‌`. అరుణాచ‌ల క్రియేష‌న్స్ బ్యాన‌ర్ పై స్టార్ డైరెక్ట‌ర్ కొర‌టాల శివ స‌మ‌ర్ప‌ణ‌లో కృష్ణ కొమ్మ‌ల‌పాటి ఈ మూవీని నిర్మిస్తున్నారు. హైవోల్టేజ్ యాక్ష‌న్ డ్రామాగా తెర‌కెక్క‌తున్న ఈ మూవీ ద్వారా వి.వి. గోపాల‌కృష్ణ ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నారు.

ఇప్ప‌టి వ‌ర‌కు స‌త్య‌దేవ్ క‌నిపించ‌ని స‌రికొత్త పాత్ర‌లో న‌టిస్తున్న మూవీ ఇది. ఇటీవ‌ల విడుద‌ల చేసిన ఫ‌స్ట్ లుక్ లో ఇంటెన్స్ అవ‌తార్ లో క‌నిపించిన తీరు సినిమాపై అంచ‌నాల్ని పెంచేసింది. తాజాగా గురువారం హీరో సాయిధ‌ర‌మ్ తేజ్ ఈ మూవీ టీజ‌ర్ ని సోష‌ల్ మీడియా వేదిక‌గా విడుద‌ల చేశారు. `రా..ఇంటెన్స్ తో కూడుకున్న టీజ‌ర్ ని విడుద‌ల చేయ‌డం ఆనందంగా వుంది. టీమ్ అంద‌రికి ఆల్ ద బెస్ట్‌` అన్నారు. ఈ సంద‌ర్భంగా విడుద‌ల చేసిన కొత్త పోస్ట‌ర్ కూడా ఆక‌ట్టుకుంటోంది.

ఓ యువ‌కుడికి కృష్ణ న‌దికి వున్న అనుబంధం నేప‌థ్యంలో ఇంటెన్స్ రా స్టోరీగా ఈ మూవీని తెర‌కెక్కించారు. ద‌ట్ట‌మైన అడ‌వి విజువ‌ల్స్ తో హీరో స‌త్య‌దేవ్ వాయిస్ తో టీజ‌ర్ మొద‌లైంది. ` ఈ కృష్ణ‌మ్మ లాగే మేమూ ఎప్పుడు పుట్టామో ఎలా పుట్టామో ఎవ్వ‌డికీ తెలియ‌దు..ఎప్పుడు పుట్టినా ఎలా పుట్టినా పుట్టిన ప్ర‌తీఓడికీ ఏదో క‌థ వుండే వుంట‌ది. క‌థ న‌డ‌క‌..న‌ది న‌డతా ప్ర‌శాంతంగా సాగిపోవాంటే ఎవ్వ‌డూ గెల‌క్కూడ‌దూ.. కానీ గెలికారూ..` అంటూ హీరో స‌త్య‌దేవ్ త‌న క‌థ‌ని చెబుతున్న తీరు ఆకట్టుకుంటోంది.

చేయ‌న‌పి త‌ప్పుకి శిక్ష‌ప‌డిన ఓ యువ‌కుడు తిరిగి ఎలా త‌న ప్ర‌తీకారాన్ని తీర్చుకున్నాడు అనే నేప‌థ్యంలో ప‌వ‌ర్ ఫుల్ క‌థ‌గా ఈ మూవీ సాగ‌నున్న‌ట్టుగా తెలుస్తోంది. క‌ళాభైర‌వ అందించిన నేప‌థ్య సంగీతం.. కొన్ని సీన్ ల‌లో రెడ్ క‌ల‌ర్ డ్రెస్ లో చేతిలో క‌త్తి ప‌ట్టుకుని ప్ర‌త్య‌ర్థుల‌పై స‌త్య‌దేవ్ విరుజుకుప‌డుతున్న తీరు `కృష్ణ‌మ్మ‌` క‌మ‌ర్షియ‌ల్ ఎలిమెంట్స్ తో సాగే ప‌క్కా మాస్ మ‌సాలా యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ గా క‌నిపిస్తోంది. టీజ‌ర్ లో క‌నిపిస్తున్న ఇంటెన్స్ సీన్స్ ని బ‌ట్టి చూస్తుంటే హ్యాపీగా సాగే ముగ్గురి స్నేహితుల జీవితాల్లో చెల‌రేగిన క‌ల్లోలం నేప‌థ్యంలో సినిమా సాగుతుంద‌ని తెలుస్తోంది.

టీజ‌ర్ ఎండింగ్ లో కాషాయం ధ‌రించి స‌త్య‌దేవ్‌ రుద్రుడిలా క‌త్తిప‌ట్టుకుని ఊగిపోతున్న తీరు సినిమాపై అంచ‌నాల్ని పెంచేస్తోంది. ల‌క్ష్మ‌ణ్‌, అధిరా రాజ్‌, అర్చ‌న‌, నంద‌గోపాల్‌, ర‌ఘు కుంచె, తార‌క్‌, స‌త్యం త‌దిత‌రులు న‌టిస్తున్నారు. స్టార్ డైరెక్ట‌ర్ కొర‌టాల శివ తొలి సారి స‌మ‌ర్ప‌కుడిగా వ్య‌వ‌హ‌రిస్తున్న సినిమా కావ‌డం విశేషం.

త్వ‌ర‌లోనే థియేట‌ర్ల‌లోకి రానున్న ఈ మూవీకి సంగీతం కాల‌భైర‌వ‌, ఛాయాగ్ర‌హ‌ణం స‌న్నీ కూర‌పాటి, ఎడిటింగ్ తిమ్మ‌రాజు. రీసెంట్ గా `గాడ్సే` మూవీతో ప్రేక్ష‌కుల ముందుకొచ్చిన స‌త్య‌దేవ్ ఖిలాడీ హీరో అక్ష‌య్ కుమార్ న‌టిస్తున్న `రామ్ సేతు`తో బాలీవుడ్ కు ప‌రిచ‌యం అవుతున్న విష‌యం తెలిసిందే.