Begin typing your search above and press return to search.
హిందీలో ఛాన్స్.. పూరి ఇప్పించాడా?
By: Tupaki Desk | 27 Dec 2018 1:30 AM GMT‘జ్యోతిలక్ష్మీ’.. ‘క్షణం’.. ‘ఘాజీ’.. లాంటి సినిమాలతో నటుడిగా తనేంటో రుజువు చేసుకున్నాడు సత్యదేవ్. పాత్ర చిన్నదైనా సరే.. తనదైన స్క్రీన్ ప్రెజెన్స్ తో ప్రత్యేకత చాటుకుంటాడు సత్యదేవ్. అతను తొలిసారి పూర్తి స్థాయి హీరోగా నటించిన ‘బ్లఫ్ మాస్టర్’ ఈ శుక్రవారమే మంచి అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సినిమా తన కెరీర్ ను మార్చేస్తుందని అతను ఆశిస్తున్నాడు. ఐతే ‘బ్లఫ్ మాస్టర్’ విడుదలకు ముందే అతను హిందీలో నటించే అవకాశం దక్కించుకోవడం విశేషం. ఈ విషయాన్ని అతనే స్వయంగా వెల్లడించాడు. బాలీవుడ్లో టెర్రరిజం నేపథ్యంలో సాగే ఓ సినిమాలో కీలక పాత్ర చేస్తున్నట్లు సత్యదేవ్ తెలిపాడు.
బహుశా ఈ అవకాశం పూరి జగన్నాథ్ వల్లే వచ్చి ఉంటుందని భావిస్తున్నారు. తన గురువు వర్మ ద్వారా బాలీవుడ్లో పూరికి మంచి పరిచయాలే ఉన్నాయి. అక్కడ అమితాబ్ బచ్చన్ కథానాయకుడిగా ‘బుడ్డా హోగా తేరీ బాప్’ అనే సినిమాను కూడా డైరెక్ట్ చేశాడు పూరి. ‘జ్యోతిలక్ష్మీ’ సినిమాతో సత్యను వెలుగులోకి తెచ్చింది పూరీనే. అతడిపై పూరీకి బాగానే గురి ఉంది. ఆయనే బాలీవుడ్ వాళ్లకు సత్య గురించి చెప్పి అతడికి అక్కడ ఛాన్సొచ్చేలా చేశాడంటున్నారు. ‘బ్లఫ్ మాస్టర్’ కాకుండా సత్యదేవ్ హీరోగా తెలుగులో ఇంకో రెండు సినిమాలు ప్రొడక్షన్ దశలో ఉన్నాయి. ‘47 డేస్’ అనే థ్రిల్లర్ మూవీతో పాటు ‘గువ్వాగోరింకా’ అనే లవ్ స్టోరీలోనూ నటిస్తున్నాడతను. ‘బ్లఫ్ మాస్టర్’ బాగా ఆడితే ఆ చిత్రాలకూ క్రేజ్ వస్తుందని అతను ఆశిస్తున్నాడు.