Begin typing your search above and press return to search.

వింత ప్రశ్నలు.. వెరైటీ సమాధానాలు..!

By:  Tupaki Desk   |   8 Dec 2022 8:30 AM GMT
వింత ప్రశ్నలు.. వెరైటీ సమాధానాలు..!
X
కన్నడలో సూపర్ హిట్టైన లవ్ మాక్ టైల్ మూవీని తెలుగులో గుర్తుందా శీతాకాలం అంటూ రీమేక్ చేశారు. యువ హీరో సత్యదేవ్ లీడ్ రోల్ లో నటించిన ఈ సినిమాలో మిల్కీ బ్యూటీ తమన్నా మేఘా ఆకాష్ ఫీమేల్ లీడ్స్ గా నటించారు. శుక్రవారం రిలీజ్ కాబోతున్న ఈ సినిమా ప్రమోషన్స్ లో సూపర్ బిజీగా ఉన్నారు హీరో సత్యదేవ్. చిన్న చిన్న పాత్రలు చేస్తూ వచ్చి మంచి గుర్తింపు తెచ్చుకుని సోలో హీరోగా ఎదిగాడు సత్యదేవ్. కంటెంట్ ఉన్న సినిమాలను చేస్తూ మెప్పిస్తున్న సత్యదేవ్ బాలీవుడ్ ఛాన్స్ లను అందుకుంటున్నాడు.

ఈ ఇయర్ ఆల్రెడీ హిందీలో అక్షయ్ కుమార్ తో రామ్ సేతు సినిమా చేశాడు సత్యదేవ్. సినిమా ఫలితం ఎలా ఉన్నా ఏపీ పాత్రలో సత్యదేవ్ నటనకు బీ టౌన్ ఆడియన్స్ ఫిదా అయ్యారు. ఇక గుర్తుందా శీతాకాలం రిలీజ్ టైం సందర్భంగా తనని ఫాలో అవుతున్న నెటిజన్లతో కూడా సత్యదేవ్ చిట్ చాట్ చేశారు. బాలీవుడ్ లో నటించడం ఎలా అనిపించింది.. ఫ్యూచర్ లో హిందీ సినిమాలు చేస్తారా అని అడిగిన ఒక అభిమాని ప్రశ్నకు తప్పకుండా చేస్తా.. మీరు నా పై చూపిస్తున్న అభిమానానికి థ్యాంక్స్ అని అన్నారు.

ఒకవేళ మీరు యాక్టర్ కాకుంటే ఏమయ్యేవారు.. అని ఒక అభిమాని అడిగితే నువ్వు అడిగే వరకు అది ఆలోచించలేదు.. దర్శకుడిని అయ్యే వాడినేమో అని అన్నారు సత్యదేవ్. మీరు ఎన్.టి.ఆర్ తో కలిసి నటిస్తే చూడాలని ఉందని మరో ఫ్యాన్స్ అడిగితే.. గట్టిగా కోరుకోండి జరిగిపోద్దని.. తాను కూడా ఆ అవకాశం కోసం ఎదురుచూస్తున్నా అని అన్నారు సత్యదేవ్. అక్షయ్ తో పనిచేయడం ఎలా అనిపించిందని ఒకరు అడగ్గా .. అక్షయ్ అంటే తనకు ఎంతో ఇష్టమని.. సినిమా చేశాక వీరభిమాని అయ్యానని.. ఆయనతో ఇంకా సినిమాలు చేయాలని ఉందని అన్నారు సత్యదేవ్.

ఈమధ్య ఆడియన్స్ రీమేక్ ల మీద ఆసక్తి చూపించట్లేదు. గుర్తుందా శీతాకాలం మూవీ ఓటీటీ రిలీజ్ ఎందుకు చేయలేదని ఒకరు అడిగితే.. ఓటీటీ ఆఫర్లు వచ్చాయి. ఈ సినిమా థియేటర్ లో చూస్తేనే బాగుంటుందని ఇలా ప్లాన్ చేశారని అన్నారు. చిరంజీవితో కలిసి పనిచేయడం ఎలా అనిపించిందని ఒక అభిమాని అడిగితే.. మేజికల్ గా అనిపించిందని.. ఆ షూటింగ్ రోజుల్ని జీవితాంతం గుర్తు పెట్టుకుంటా అని అన్నారు సత్యదేవ్.

నువ్వు ఏం చేస్తావో తెలియదు పవన్ సుజిత్ సినిమాకు అనిరుధ్ మ్యూజిక్ ఉండాలని ఒక నెటిజన్ అడిగితే తాను కూడా అదే కోరుతున్నానని అన్నారు. నీ పలుకుబడి ఉపయోగించి SSMB28వ సినిమా అప్డేట్ ఇప్పించండి అని మరొకరు అడిగితే.. కావాలంటే నా సినిమా టికెట్ ఇప్పిస్తా.. కానీ ఆ సినిమా అప్డేట్ నేనెలా ఇవ్వగలని అన్నారు. నీ సినిమాపై ఆసక్తి రావట్లేదు.. చూశాక బాగుంటే మెసేజ్ చెయ్.. టికెట్ బుక్ చేసుకుంటానని ఒక నెటిజెన్ కామెంట్ చేయగా చూశా బాగుంది టికెట్ బుక్ చేసుకో అని ఆన్సర్ ఇచ్చారు సత్యదేవ్. ఇక తనకు ముగ్గురు గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారని.

ఈ సినిమా కథ తనకు దగ్గరగా ఉందని తనకు 3 టికెట్లు ఇప్పించండి అని ఒకరు అడిగితే.. 3 టికెట్లా అయితే నువ్వు సినిమాకి రావట్లేదా అని పంచ్ వేశారు సత్యదేవ్. రాం సేతులో ఆ పాత్ర కోసం రెండు నెలలు పూర్తిగా శాకాహారిగా ఉన్నానని.. ఆ టైం లో సోషల్ మీడియాకు దూరంగా ఉన్నానని అన్నారు సత్యదేవ్. ఇక టాలీవుడ్ స్టార్స్ గురించి వన్ లైన్ గా పవన్ అంటే పవర్ స్ట్రోమ్.. ఎన్.టి.ఆర్ టార్చ్ బేరర్.. అల్లు అర్జున్ ఐకాన్.. చరణ్ మోస్ట్ లవబుల్ స్టార్ ఆఫ్ ఇండియా.. ప్రభాస్ మిస్టర్ పర్ఫెక్ట్ అన్నారు సత్యదేవ్. మొత్తానికి నెటిజన్లు సత్యదేవ్ కు వింత ప్రశ్నలు అడగ్గా.. అతను కూడా వెరైటీ సమాధానాలు చేశాడు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.