Begin typing your search above and press return to search.
మెగాస్టార్ లైవ్ వైర్ లాంటివారు: సత్యదేవ్!
By: Tupaki Desk | 27 Sep 2022 11:30 PM GMTమెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా నటిస్తోన్న 'గాడ్ ఫాదర్' అక్టోబర్ 5న భారీ అంచనాల మధ్య రిలీజ్ అవుతోన్న సంగతి తెలిసిందే. రాజకీయన నేపథ్యంలో మోహన్ రాజా దర్శకత్వం వహిస్తోన్న ఈ మలయాళీ రీమేక్ పై అంచనాలు అంతకంతకు పెరిగిపోతున్నాయి. ఇప్పటికే రిలీజ్ అయిన ప్రచార చిత్రాలు మెగాస్టార్ ఎలివేషన్స్ అభిమానుల్లో పూనకాలు తెప్పిస్తున్నాయి.
రిలీజ్ డేట్ కోసం ఎంతో ఎగ్జైట్ మెంట్ తో ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఓ ఇంటర్వ్యూలో మెగాస్టార్ గు రించి సత్యదేవ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. ఇందులో సత్యదేవ్ కూడా ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ సందర్భంగానే చిరు గురించి ప్రస్తావించారు.
'చిరంజీవి చాలా క్రమశిక్షణతో ఉంటారు. సెట్స్‌లో ఆయన ఎంతో ఎనర్జిటిక్‌గా పనిచేస్తారు. ఎప్పుడు ఎలా ఉండాలి? ఎవరితో ఎలా మెలగాలి. ప్రతీది ఆయనకు ఓ లెక్క ఉంటుంది. చిన్న..పెద్ద అనే తారతమ్యం ఉండదు. ఎవరినైనా ఒకేలా ట్రీట్ చేస్తారు. అదే ఆయన గొప్పతనం. ఆయన ఓ లైవ్ వైర్ లాంటివారు. అందురూ అందుకే అతన్ని మెగాస్టార్ అని పిలుస్తారని'' చెప్పుకొచ్చారు.
ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి. మెగాస్టార్ గురించి యువతరం ఇలా మాట్లాడటం కొత్తేం కాదు. మెగాస్టార్ స్పూర్తితో పరిశ్రమికి వచ్చిన వారెందరో ఉన్నారు. ఆయన స్పూర్తితో హీరో అయిన వారు...నటులుగా మారిన వారు చాఆ మంది ఉన్నారు. కళామాతల్లి ఒడిలో ఒదిగిపోవాలంటే క్రమశిక్షణ...పట్టుదల ఎంతో ఉండాలని అప్పుడే అనుకున్నది సాధించగలరని చిరంజీవి ఎప్పటికప్పడు యువతకు సూచిస్తుంటారు.
అంత కమిట్ మెంట్ ఉంటేనే సినిమాల్లోకి రావాలని అంటుంటారు. చిరంజీవితో సత్యదేవ్ తెరను పంచుకోవడం ఇది రెండవ సారి. ఇటీవలే చిరంజీవి నటించిన 'ఆచార్య'లో చిత్రంలో ప్లాష్ బ్యాక్ లో రామ్ చరణ్ తండ్రి పాత్ర (నక్సలైట్) పోషించిన సంగతి తెలిసిందే. భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన సినిమా వాటిని అందుకోవడంలో విఫలమైంది.
వెంటనే మళ్లీ సత్యదేవ్ 'గాడ్ పాదర్' లో ఛాన్స్ అందుకోవడం విశేషం. అలాగే సత్యదేవ్ హీరోగానూ కొన్ని సినిమాలు చేస్తున్నాడు. కొన్ని సిరిమాలు రిలీజ్ కి రెడీ అవుతున్నాయి. నటుడిగా ఆయనకు తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ఆ ఐడెంటిటీతోనే అవకాశాలు అందుకుంటున్నాడు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.