Begin typing your search above and press return to search.

సూర్యకు వాయిస్‌ ఇస్తున్న టాలీవుడ్‌ యంగ్‌ హీరో

By:  Tupaki Desk   |   22 May 2020 4:15 AM GMT
సూర్యకు వాయిస్‌ ఇస్తున్న టాలీవుడ్‌ యంగ్‌ హీరో
X
తమిళ స్టార్‌ హీరో సూర్య ప్రస్తుతం సూరరై పోట్రు చిత్రంలో నటిస్తున్న విషయం తెల్సిందే. త్వరలో సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఆ సినిమాకు సంబంధించిన చిత్రీకరణ దాదాపుగా పూర్తి అయ్యింది. తెలుగు దర్శకురాలు సుధ కొంగర ఈ చిత్రాన్ని తెరకెక్కించింది. తెలుగులో ఈ సినిమాను ఆకాశమే నీ హద్దురా అనే టైటిల్‌ తో విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

తెలుగు వర్షన్‌ కు సూర్య పాత్రకు గాను యంగ్‌ హీరో సత్యదేవ్‌ డబ్బింగ్‌ చెప్పబోతున్నాడు. జ్యోతి లక్ష్మి చిత్రంతో పాటు పలు చిత్రాల్లో నటించి నటుడిగా మంచి పేరు దక్కించుకున్న సత్యదేవ్‌ వాయిస్‌ మాడ్యూలేషన్‌ బాగుంటుంది. డైలాగ్‌ డెలవరీ ఆకట్టుకునే విధంగా ఉంటుంది. అందుకే ఆయనతో ఈ సినిమాలో సూర్య పాత్రకు డబ్బింగ్‌ చెప్పిస్తున్నట్లుగా తెలుస్తోంది.

సూర్య గత చిత్రానికి సొంతంగా డబ్బింగ్‌ చెప్పుకున్నాడు. అది వర్కౌట్‌ అవ్వలేదు. తెలుగు అంతంత మాత్రంగా మాట్లాడే సూర్య డబ్బింగ్‌ చెప్పడం సినిమాకు మైనస్‌ అవుతుంనే ఉద్దేశ్యంతో సత్యదేవ్‌ తో డబ్బింగ్‌ చెప్పించాలనే నిర్ణయానికి వచ్చారట.

ఎయిర్‌ డెక్కన్‌ వ్యవస్థాపకుడు జీఆర్‌ గోపీనాథ్‌ జీవిత చరిత్ర ఆధారంగా రూపొందిన ఈ చిత్రంలో బాలీవుడ్‌ నటుడు జాకీ ష్రాఫ్‌ కీలక పాత్రలో కనిపించనున్నాడు. ఇక తెలుగు స్టార్‌ నటుడు మోహన్‌ బాబు కూడా ఈ చిత్రంలో నటించాడు. తమిళంతో పాటు తెలుగులో కూడా భారీ అంచనాలున్న ఈ సినిమాను త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.