Begin typing your search above and press return to search.

సత్యదేవ్ ఫ్యామిలీ ఫొటో.. కొడుకు, భార్యతో ఇలా..

By:  Tupaki Desk   |   9 Feb 2023 8:30 PM IST
సత్యదేవ్ ఫ్యామిలీ ఫొటో.. కొడుకు, భార్యతో ఇలా..
X
టాలీవుడ్ లో మోస్ట్ టాలెంటెడ్ యాక్టర్ గా తనకంటూ ప్రత్యేకమైన బ్రాండ్ క్రియేట్ చేసుకున్న నటుడు సత్యదేవ్. చిన్న చిన్న పాత్రలతో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కెరియర్ స్టార్ట్ చేసిన సత్యాదేవి తరువాత జ్యోతిలక్ష్మి సినిమాతో హీరోగా అయ్యాడు.

ఏకంగా స్టార్ హీరోయిన్ చార్మికి జోడీ గా నటించే ఛాన్స్ ని ఆ సినిమాలో సొంతం చేసుకున్నాడు. ఆ మూవీని చార్మి కోసం పూరి జగన్నాథ్ తెరకెక్కించిన ఆమె కంటే సత్యదేవ్ కి ఎక్కువ పేరు వచ్చింది.

తరువాత వెనక్కి తిరిగి చూసుకునే అవకాశం లేకుండా ఓ వైపు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తూనే మరో వైపు హీరోగా కూడా దూసుకుపోతున్నాడు. ఇక గాడ్ ఫాదర్ సినిమాలో మెగాస్టార్ చిరంజీవికి ప్రతినాయకుడిగా నటించే ఛాన్స్ ని కూడా సొంతం చేసుకున్నాడు.

ఇక ఆ సినిమాలో చిరంజీవిని బీట్ చేసే విధంగా సత్యదేవ్ పెర్ఫార్మెన్స్ ఉంటుందని చెప్పాలి. అలాగే గత ఏడాది రామ్ సేతు సినిమాలో హనుమాన్ రెప్లిక క్యారెక్టర్ లో నటించి సత్యదేవ్ మెప్పించాడు.

ఆ మూవీకి సత్యదేవ్ పాత్ర చాలా కీలకం అని చెప్పాలి. ఇప్పుడు ఆ సినిమాతో హిందీలో కూడా సత్యదేవ్ గుర్తింపు పెంచుకొని అవకాశాలు సొంతం చేసుకుంటున్నాడు. ప్రస్తుతం హీరోగా అతని చేతిలో బ్లఫ్ మాస్టర్ సీక్వె ఉన్నట్లు తెలుస్తుంది. దాంతో పాటు రెండు మూడు ఇంటరెస్టింగ్ ప్రాజెక్ట్స్ కూడా ఉన్నాయని సమాచారం. అయితే ఇండస్ట్రీలో సక్సెస్ వచ్చేంత వరకు సత్యదేవ్ తన ఫ్యామిలీని పరిచయం చేయలేదు.

గుర్తుందా శీతాకాలం సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ లో మొదటి సారి తన భార్య, కొడుకుని పరిచయం చేశాడు. తాజాగా మరోసారి ఇన్స్టాగ్రామ్ లో భార్య, కొడుకుతో ఉన్న ఫోటోని సత్యదేవ్ షేర్ చేశాడు. తన కొడుకు సావర్మిక్ మూడేళ్ళు పూర్తి చేసుకున్నాడని, తమ ప్రేమకి పుట్టిన రోజు శుభాకాంక్షలు అంటూ తెలియజేశాడు. ఈ ఫోటోలో సత్యదేవ్ కొడుకు సావర్నిక్ చాలా క్యూట్ గా ఉన్నాడు అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.